గులాబీ దూకుడు


Wed,September 12, 2018 01:50 AM

మహబూబ్‌నగర్,నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ప్రకటన వెలువడినప్పటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో ప్రచారాల సందడి పదునెక్కుతుంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులు ముఖ్య పట్టణాలు,గ్రామాలకు వెళ్లి తమ కొత్త అభ్యర్థిత్వంపై ప్రజలను ఉత్సాహంగా కలుస్తున్నారు. కేసీఆర్ టీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలను ప్రకటించిన అనంతరం వారు నియోజకవర్గాలకు వస్తున్న క్రమంలో స్వచ్ఛందంగా ప్రజలే అభ్యర్థులకు బ్రహ్మరథం పడుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం మారిపోయింది. నియోజకవర్గానికి అభ్యర్థులు వచ్చినా ప్రజలు వారికి బ్రహ్మరథం పడుతున్నారు. అభ్యర్థుల ప్రకటనతోనే ఎన్నికల వాతావరణం నిండిన పల్లెల్లో జనం ఆసక్తి కనబరుస్తున్నారు. నిరంతరం అభివృద్ధి పనుల అమలులో టీఆర్‌ఎస్ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలంతా జనం మధ్యలోనే ఎక్కువగా గడిపారు. కోణంలో కాకుండా ఉద్యమపంథాలోనే టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనను కొనసాగించింది. తర్వాత మళ్లి ఎన్నికలప్పుడు వచ్చిన నాయకులను చూసిన ప్రజలకు నిరంతరం నాలుగున్నరేళ్లు ప్రజల మధ్య గడిపిన మంత్రులు, చూసి సమైక్యపాలనకు....స్వరాష్ట్ర పాలనకు తేడాను చర్చించుకుంటున్నారు.

పది నియోజకవర్గాల్లో ప్రచారం జోరు
ఉమ్మడి జిల్లాలోని పది నియోజవర్గాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు తమ ప్రచారాలకు పదునుపెట్టారు. రోజులుగా అసెంబ్లీ పరిధిలోని మండలాలు గ్రామాల్లో అభ్యర్థులు ఉత్సాహంగా పర్యటనలు చేస్తున్నారు. కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణా రావు, వనపర్తిలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, మహబూబ్‌నగర్, మక్తల్, నారాయణపేట, కొడంగల్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో తాజా మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌ చిట్టెం రామ్మోహన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, గువ్వల బాలరాజ్, ఎమ్మెల్సీ పట్నం నరేందర్ రెడ్డిలతోపాటు అబ్రహం, బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డిలు తమ ప్రచారం ముమ్మరం చేశారు. అభ్యర్థులు ఆలయా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ప్రజలు అభ్యర్థులకు భాజా భజంత్రీలతో స్వాగతం పలుకుతూ అన్నీ విధాలా మేమున్నామంటూ ముందుకెళ్తు కల్పిస్తున్నారు.

నేడు జడ్చర్ల, ఉమ్మడి జిల్లాలో మిగిలిన నియోజవర్గాల్లోనూ బుధవారం ఎన్నికల ప్రచారాలను నిర్వహించబోతున్నారు. వీటిలో జడ్చర్లలో మంత్రి లకా్ష్మ రెడ్డి, నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డిలు తమ ప్రచారాలను ప్రారంభించనున్నారు. మండల కేంద్రంలోని ఆంజనేయస్వామి ఆలయంలో మంత్రి లకా్ష్మ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని భారీగా చేపడుతున్నారు. మండలం పామాపురంలోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భూత్పూరు మండలం తాటిపర్తిలో ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రచారం చేయనున్నారు. నియోజవర్గాల్లోనూ మండలాల వారిగా ముఖ్యకార్యకర్తల సమావేశాలను అభ్యర్థులు అంజయ్య యాదవ్, యాదవ్ ఏర్పాట్లు చేసుకున్నారు.

అభ్యర్థులకు పెరుగుతున్న ఆదరణ
జిల్లాలో ఎన్నికల ప్రచారాలకు వెళుతున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులకు ఓటర్ల ఆదరణ పెరుగుతోంది. వివిధ సంక్షేమ పథకాలను అందించడంలో నాలుగున్నరేళ్లు ప్రజల మధ్య గడిపారు. ఇప్పటికే అభ్యర్థులకు...ప్రజలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ముందు నుంచి వస్తున్నది.

144
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...