సమష్టి కృషితోనే మార్పులను అధిగమించవచ్చు


Wed,September 12, 2018 01:49 AM

బిజినేపల్లి : ప్రతి ఒక్కరూ సమష్టి కృషి చేస్తేనే వాతావరణ మార్పులను అధిగమించవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం డీన్ సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని పాలెం గ్రా మంలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జీఐజడ్, సెంటర్ ఫర్ ఇన్వార్‌మెంట్ ఈటీటీఆర్‌ఐ సంయుక్తంగా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా వాతావరణంలో ఏర్పడిన మార్పులను వివరిస్తూ రైతులు క్రమశిక్షణతో సంఘటితంగా ఈ దృష్ప్రాభావాలను ఎదుర్కొనే విధంగా తయారు కావాలన్నారు. పంటలు, పంటల రకాల ఎన్నిక వాతావరణ మార్పులకు అనుగుణంగా ఉండాలని చెప్పారు. నేల, నీరు, వృక్ష సంపదను వాతావరణ ప్రభావితానికి గురి కాకుండా చూడాలన్నారు. భారతదేశం ఒక వ్యవసాయ దేశం గా ఆ నాటి నుంచే ఉందని, గతంలో 67 శాతం వ్యవసాయంపై ఆధారపడి జీవించే వారని, ప్రస్తుతం 58శాతం వ్యవసాయంపై ఆధారపడి రైతులు పంటలను సాగు చేస్తున్నారన్నారు. ఇప్పటికీ రైతులు వ్యవసాయం చేయడం తగ్గినప్పటికీ 286 రకాల ఉత్పత్తులను చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 3.50కోట్ల మంది ఉండగా 50శాతం మంది రైతులు పంటలను సాగు చేస్తున్నారని ఆయన వివరించారు. అనంతరం వాతావరణ మార్పుల ప్రభావం, వాటి ని ఎలా ఎదుర్కొవాలనే అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏడీఆర్ వెంకటరమణ, కేవీకే కో ఆర్డినేటర్ జగన్మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు, వివేక్, పట్టాభితోపాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.

102
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...