ప్రాజెక్టులకు స్వల్పంగా వరద


Wed,September 12, 2018 01:49 AM

-జూరాల ఇన్‌ఫ్లో 15,000 క్యూసెక్కులు
జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి /అమ్రాబాద్ రూరల్ :ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలానికి స్వల్పంగా వర ద కొనసాగుతుంది. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి మొత్తంగా 22,773 క్యూ సెక్కుల ఇన్ ఫ్లో శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకుంది. అవుట్‌ఫ్లో 71,141 క్యూసెక్కులుగా నమోదైంది. మంగళవారం రాత్రి 9 గంటలకు 879.20 అడుగులకు చేరి, 183. 8486 టీఎంసీలుగా నమోదైంది. తెలంగా ణ పవర్ హౌస్ నుంచి 42,378 క్యూ సెక్కులు దిగువకు పోతిరెడ్డిపాడుకు 24, 000 క్యూసెక్కులు, ఎంజీకేఎల్‌ఐకి 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.జూరాలకు స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతుంది. మంగళవారం జూరాల ఇన్‌ఫ్లో 15,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 29,106 క్యూసెక్కులు నమోదైంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా 22,773 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నా రు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 1, 044 .554 అడుగుల ఎత్తులో 9.377 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి కాలువకు 795 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 1400 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 835 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నా రు. భీమా లిఫ్ట్-1 ద్వారా 1300 క్యూ సెక్కులు, భీమా లిఫ్ట్-2 ద్వారా 750 క్యూ సెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ద్వారా 315 క్యూసెక్కులు, నెట్టెంపాడుకు 1500 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. కర్నాటకలో ని ఆల్మట్టి, నారాయణపూర్ స్వల్ప ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో నమోదైంది. తుంగభద్ర ఇన్‌ఫ్లో 8,848 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 11,075 క్యూసెక్కులు నమోదైంది.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...