ఉత్తమ సేవలకు గుర్తింపు ఉంటుంది


Wed,September 12, 2018 01:48 AM

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్
మహబూబ్‌నగర్ క్రైం : ఎక్సైజ్ శాఖ పరంగా నేరాల నియంత్రణకు కృషి చేసిన సిబ్బందికి గుర్తింపు ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ డైరెక్టర్ అకున్ సబర్వాల్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో వంద రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఉత్తమ సేవలు అందించిన పలువురు ఎక్సైజ్ అధికారులను, సిబ్బందిని ఈడీ అకున్ సబర్వాల్ ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు. అందులో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా ఎక్సైజ్ పోలీసుస్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దామోదర్‌రెడ్డికి మంగళవారం ఈడీ ప్రశంసాపత్రంతోపాటు అవార్డును అందజేశారు. ఈ అవార్డు అందసుకున్న ఎక్సైజ్ సీఐ దామోదర్‌రెడ్డిని మహబూబ్‌నగర్ ఉమ్మ డి జిల్లా డిప్యూటీ కమిషనర్ జయాసేనారెడ్డి, మహబూబ్‌నగర్ ఈఎస్ అనితతోపాటు పలువురు సిబ్బంది అభినందించారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...