నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి


Wed,September 12, 2018 01:48 AM

అమ్రాబాద్ రూరల్ : ప్రతి వ్యక్తి నాయకత్వ లక్షణాలు అలవర్చుకుంటే ఏ సమస్య వచ్చినా సులువుగా అధిగమించ గలుగుతాడని దూలపల్లి డీఎఫ్‌వో హన్మంత్‌రెడ్డి పేర్కొన్నారు. మన్ననూర్‌లోని వనమాలికలోని సీ బీట్లో జిల్లా అటవీ సిబ్బందికి రెండో రోజైన మంగళవారం మానవ విలువలు- ఉద్యోగుల పాత్ర అనే అంశం పై శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన హన్మంత్‌రెడ్డి మాట్లాడుతూ ఏ వ్యక్తి అయినా రోజు వారి జీవన విధానంలో ఒక ముందుచూపు ప్రణాళికతో నడుచుకోగలడో అదే స్ఫూర్తిని తన నిత్య జీవితంలో పాటించుటకు వీలుపడుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ విశ్రాంత ఉద్యోగి రాంప్రసాద్, అమ్రాబాద్ రిజర్వు టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ ఐఎఫ్‌ఎస్ వినదోకుమార్, జిల్లా అటవీశాఖ అధికారి జోజి, అమ్రాబాద్ డివిజనల్ అధికారి వెంకటేశ్వర్లు, రేంజర్లు ప్రభాకర్, శ్రీదేవి, డీఆర్‌వో లక్ష్మీకాంతరావు, దూలపల్లి శిక్షణా కేంద్రం డీఆర్వో ఎన్ ఉమారాణి, దేవరాజు, సెక్షన్, బీట్ అధికారులు పాల్గొన్నారు

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...