టీడీపీతో పొత్తు వద్దు


Wed,September 12, 2018 01:48 AM

-డీసీసీబీ చైర్మన్ కే వీరారెడ్డి
మరికల్ : జాతీయ స్థాయిలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారని డీసీసీబీ చైర్మన్ కే వీరారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని తీలేరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైన టీడీపీతో పొత్తు ఆలోచనను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు విరమించుకోవాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు టీడీపీతో ఎప్పుడూ వైరం ఉందని, వారితో గ్రామాల్లో నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయని దీనిని అధిష్టానం దృష్టిలో ఉంచుకోవాలని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా కార్యకర్తల అభిష్టం మేరకు తాను నారాయణపేట్ లేదా మక్తల్ నియోజకవర్గాలో ఏదో ఒక స్థానం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పా రు. అయితే అధిష్టానం ఏదీ నిర్ణయిస్తే దానికి కట్టుబడి పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్‌గుప్తా, బజారప్ప, శివరాములు, సంజీవరెడ్డి, కుర్మన్న, మల్లేశ్, మల్లప్ప, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు

129
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...