వీఆర్‌వో పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి


Wed,September 12, 2018 01:48 AM

-జిల్లా కలెక్టర్ శ్రీధర్
నాగర్‌కర్నూల్ టౌన్: ఈనెల 16వ తేదీన నిర్వహించనున్నట్లు వీఆర్‌వో పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులకు సూచించారు. ఈమేరకు క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో పరీక్ష నిర్వాహణపై సమీక్షా నిర్వహించారు. అభ్యర్థులు సంబంధిత పరీక్షా కేంద్రాలకు అరగంట ముందుగానే చేరుకునేలా చూడాలన్నారు. జిల్లాలో 91 పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని, 27 వేల 710 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో మెడికల్, పోలీస్, బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, పరిసరాల్లోని పరీక్షా రోజున జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో డీఆర్‌వో మధుసూదన్‌నాయక్, ఏఎస్పీ చెన్నయ్య, ఆర్డీవో రమేశ్, హనుమానాయక్, పాండు, సంబంధిత మండల ప్రత్యేక అధికారులు, డీఈవో ఆఫీస్ ఏసీ రాజశేఖర్‌రావు పాల్గొన్నారు.

108
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...