తెలకపల్లి : మండల కాం ప్లెక్స్ సమావేశ భవనంలో మంగళవారం ఎంపీపీ హై మావతి అధ్యక్షతన జరిగిన స ర్వసభ్య సమావేశం మొక్కుబడిగా సాగింది. ఈ సందర్భం గా అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదట వ్యవసాయంపై సమీక్ష జరిగింది. రైతులకు ప్ర భుత్వం నుంచి అందుతున్నటువంటి ఫలాలను ఏవో సందీప్ వివరించారు. అనంతరం విద్యుత్ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత సాగునీటిపై చర్చ ప్రారంభం కాగా గ్రామాల్లో మిషన్‌భగీరథ పనుల కోసం రోడ్లను ఇష్టానుసారంగా తవ్వారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకాధికారులు సైతం అనంతసాగర్, చిన్నముద్దునూర్ గ్రామాల్లో మిషన్ భగీరథ పనుల వల్ల రోడ్లు అధ్వానంగా మారాయని తెలిపారు. దీంతో ఎంపీడీవో రాంమోహన్‌రావు కలుగజేసుకొని తప్పకుండా సమస్యలు ఉన్న చోట పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. మండల సమావేశానికి ఆర్‌ఆండ్‌బీ అధికారులు రావడం లేదంటూ ఎంపీటీసీలు బంగారయ్య, కువలేశ్వర్రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో అమలవుతున్నటువంటి పౌరసరఫరాలకు సంబంధించిన అంశాలను డీటీ వెంకటేశ్వర్లు వివరించారు. అనంతరం ఈజీఎస్‌పై చర్చ మొదలు కాగా హరితహార కార్యక్రమాన్ని అధికారులు నామమాత్రంగా నిర్వహిస్తున్నారని ఎంపీటీసీలు ఆరోపించారు. విద్యా, ఆరోగ్యం, శిశు సంక్షేమం వంటి అంశాలపై చర్చ కొనసాగింది. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నరేందర్‌గౌడ్, ఎంపీటీసీలు బంగారయ్య, భాగ్యమ్మ, కువలేశ్వర్రెడ్డి, హుస్సేన్‌తో పాటు ఆయా శాఖాధికారులు పాల్గొన్నారు.