విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకుని ముందుకెళ్లాలి


Wed,September 12, 2018 01:47 AM

అచ్చంపేట రూరల్ : విద్యార్థులు కళాశాల స్థాయి నుంచే లక్ష్యాలను ఎంచుకుని ముందుకెళ్లాలని తాజా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కోరారు. మంగళవారం పట్టణంలోని పటేల్ ఫంక్షన్‌హాల్‌లో చైతన్య కళాశాల ఫ్రెషర్స్ వేడుకలను ఏర్పాటు చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు స్వాగతం పలికారు. ఈ వేడుకలకు గువ్వల బాలరాజు, రైతు సమన్వయ సమి తి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్ హాజ రై మాట్లాడారు. చదువుకు పేదరికం అడ్డు కాకూడదని, ప్రతి విద్యార్థి శ్రమ, పట్టుదల, కృషితో ముందుకెళ్తే సాధించలేనిది లేదన్నారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సా ధించిన విధ్యార్థులకు బహుమతులను అం దజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మ న్ తులసీరాం, ప్రిన్సిపల్ సుల్తాన్, కార్యదర్శి గోపాల్‌రెడ్డి, డైరెక్టర్ తిరుపతిరావు, అధ్యాపక బంధం విద్యార్థులు ఉన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...