టీఆర్‌ఎస్ పాలనలోనే అభివృద్ధి


Wed,September 12, 2018 01:47 AM

ఉప్పునుంతల : టీఆర్‌ఎస్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని ఎంపీపీ అరుణ అన్నారు. మంగళవారం ఉప్పునుంతలలో మండలాధ్యక్షుడు బాలయ్య, సీనియర్ నాయకుడు గోపాల్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత 60ఏళ్ల సీమాంధ్ర పాలనలో జరగని అభివృద్ధి కేవలం నాల్గున్నర కాలంలోనే జరిగిందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఉప్పునుంతల మండలం పూర్తిగా వెనుకబాటుకు గురైందని, టీఆర్‌ఎస్ పాలనలోనే అభివృద్ధి చెందిందన్నారు. ఎంజీకేఎల్‌ఐ ద్వారా మండలంలో 30వేల ఎకరాలకు సాగునీరు అందించడం, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందనున్నాయన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్లను వేయడం జరిగిందని, అలాగే రైతులకు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సహాయం అందించినట్లు తెలిపారు.

పేద ప్రజలకు మేరుగైన వైద్యం అందించడానికి 30 పడకల దవాఖాన, మండలంలో పరిపాలన సౌలభ్యం కోసం నూతనంగా 12 కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తాజా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకుంటున్నారన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మరో మారు అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఎన్ని జిమ్మిక్కులు చేసిన ఓటమి తప్పదన్నారు. టీడీపీతో అనైతిక పొత్తు పెట్టుకుంటున్న కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం ప్రజలే చెపుతారని వారన్నారు. సమావేశంలో నాయకులు బాలయ్య, గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీ సర్వేశ్వర్, పర్వతాలు, సీహెచ్ తిరుపతయ్య, బక్కయ్య, జంగయ్య, ఎల్లయ్యయాదవ్, గణేశ్, చిన్నజంగయ్య పాల్గొన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...