సీబీతండాలో మహిళ ఆత్మహత్య


Wed,September 12, 2018 01:47 AM

ఉప్పునుంతల : పురుగుల మందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సీబీతండాలో మంగళవారం చోటు చేసుకుంది. ఏఎస్సై నాగేందర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకా రం.. చెన్నంపల్లి మండలం పోలేపల్ల్లి శివారు తండాకు చెందిన పాండు పెద్దకూతురు సునీత(27)ను 8 సంవత్సరాల క్రితం మండలంలోని సీబీతండాకు చెందిన సబావట్ జయరాంకు ఇచ్చి వివాహం జరిపించారు. పెళ్లి సందర్భంగా 4 లక్షల కట్నం, 6 తు లాల బంగారం ఇచ్చారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొద్ది రోజులుగా సునీతను భర్త జయరాంతో పాటు ఆయన తల్లిదండ్రులు, అన్న రెడ్యానాయక్ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. ఈ వేధింపులు భరించలేక మంగళవారం ఉదయం పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు ఆమెను దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది. మృతురాలి తండ్రి పాండు ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఏఎస్సై వెల్లడించారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...