చికిత్స పొందుతూ వెంకటాపురం వ్యక్తి మృతి


Wed,September 12, 2018 01:46 AM

ధరూర్ : మండలంలోని జాంపల్లి శివారులో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీ వ్రంగా గాయపడిన నారాయణ(38) చికిత్స పొందు తూ మృతి చెందినట్లు రేవులపల్లి పోలీసులు తెలిపారు. కేటీ దొడ్డి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నారాయణ సోమవారం సాయంత్రం తన బైక్‌పై కొత్త పాలెం గ్రామానికి చెందిన గోవిందుతో కలిసి గ్రామానికి వెళ్తున్న క్రమంలో కొండాపురానికి చెందిన నరేశ్ బైక్‌తో రావడంతో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో నారాయణ తీవ్రంగా గాయపడగా క్షతగాత్రుడిని 108లో గద్వాల ఏరియా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కర్నూల్‌కు తరలించగా మార్గమధ్యంలోనే నారాయణ మృతి చెందాడు. నారాయణకు భార్య జయమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

నేతల పరామర్శ...
నారాయణ మృతి పట్ల టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆదేశాల మేరకు జెడ్పీ చైర్మన్ బండారి భాస్క ర్, టీఆర్‌ఎస్ నాయకులు జాంపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి, మార్లబీడు వెంకట్ రెడ్డి, శ్రీనివాసగౌడ్ తదితరులు మృతుని కుటుంబ సభ్యుల్ని పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజే శారు. అలాగే రాష్ట్ర వి నియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, మాజీ ఎమ్మెల్యే భరత్‌సింహారెడ్డిలు కూడా మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...