పొత్తులపై కత్తులు..!


Tue,September 11, 2018 01:47 AM

మహబూబ్‌నగర్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల సందడి మొదలైంది. టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. ఇక ఇతర పార్టీల్లో అభ్యర్థుల ఎంపికలు కొలిక్కి రాకపోవడంతో ఎలాంటి సందడి కనిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలి వరకు కొనసాగిన తాజామాజీ ఎమ్మెల్యేలు సహితం ఎన్నికల వ్యవహారాలపై దృష్టి పెట్టలేదు. దీంతో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఒకేసారి 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన క్రమంలో అన్ని నియోజకవర్గాల్లో ప్రచారాలను ముమ్మరం చేసింది. అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల్లో నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచార పర్వాన్ని మొదలుపెట్టారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ప్రజలు గ్రామాల్లోకి వచ్చిన టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేకు నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండడండతో గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపక్షాలపై అనాసక్తి..
సిద్ధాంతాలను పక్కకు పెట్టి తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసిన పార్టీలన్నీ ఎన్నికల కోసం ఏకమవుతున్న వ్యవహారంపై ఏమాత్రం ఓటర్లు ఆసక్తి కనబర్చడం లేదు. ఇంత కాలం సమైక్య పాలనలో దగా చేసిన పార్టీలే మళ్లీ తెలంగాణలో అధికారం కోసం ఒక్కటవుతున్నాయన్న అభిప్రాయం గ్రామాల్లో వెల్లడవుతుంది. ఇప్పటికే దాదాపు 65 ఏళ్ల పాటు ఆంద్రాపార్టీల పాలనతో విసిగిన తెలంగాణ ప్రజలు మళ్లీ ఆ పార్టీలకు అధికారం కట్టబెట్టేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించడం లేదు. ఒక్క బీజేపీ మినహా ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా ఏర్పడేందుకు చర్చలు ప్రారంభించిన సంగతి విధితమే. ఇటీవలే హైదరాబాద్‌లో ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడి టీడీపీ నాయకులతో పొత్తులపై సంప్రదించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో టీడీపీని పూర్తిగా కనుమరుగు చేసిన క్రమంలో మళ్లీ తెలంగాణలో రాజకీయ చదరంగం నడిపించేందుకు నమ్మిన సిద్ధాంతాలకు తిలోదకాలిస్తున్నారు. పై స్థాయిలో నాయకుల మధ్య అధికారం కోసం సయోధ్య కుదిరినా.. గ్రామాల్లో మాత్రం ఆయా పార్టీల్లోని నాయకులు, కార్యకర్తలు అంగీకరించని పరిస్థితి ఉంది. ఇక ఓటర్లు సహితం తెలంగాణ సాధన కోసం పుట్టిన టీఆర్‌ఎస్ గడచిన నాలుగున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధిని ప్రధానంగా చర్చించుకుంటున్నారు.

మంతనాల్లో మల్లగుల్లాలు..
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సయోధ్య కోసం ప్రతిపక్షాలు చేపట్టిన మంతనాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. రాష్ట్ర స్థాయిలో ఇంకా ప్రాథమిక స్థాయిని కూడా దాటని మంతనాలు ఇప్పుడే కొలిక్కి వచ్చేలా లేవు. అయితే, ఇప్పటికే కింది స్థాయిలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు అభ్యర్థుల విషయంలో ఓ అవగాహనతో ఉన్నారు. కొత్తగా పొత్తుల వ్యవహారంతో జరిగే మార్పులతో మరింత గందరగోళం వస్తుందన్న చర్చ కొనసాగుతుంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, టీడీపీతో పైస్థాయిలో ఎలాగో సయోధ్య కుదిరించుకున్నా.. అది కింది స్థాయికి చేరేవరకు కొత్త సమస్యలకు ఆస్కారం వస్తుందని ఆ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. అధికారికంగా ప్రకటించడం మినహాయిస్తే అభ్యర్తులు మాత్రం ఎవరికి వారు ఎదురుచూపుల్లో ఉన్నారు. అయితే, ఈ పొత్తు వల్ల టీడీపీకి కొన్ని స్థానాలు కేటాయించాల్సి వస్తున్నందునా అయోమయం నెలకొంది. ఏ స్థానాల్లో ఏ పార్టీకి అన్న మీమాంసతో గందరగోళం ఉంది. మూడు నుంచి అయిదు స్థానాలను ఆశిస్తున్న టీడీపీకి ఏ స్థానాలు అన్న దానిపై కాంగ్రెస్ అభ్యర్థుల్లో మీమాంస ఉంది. ఇలా సీట్ల సర్దుబాట్ల సంగతటుంచితే ఆయా పార్టీలు సిద్ధాంతాలను తొంగలో తొక్కి అధికారం కోసం ఎలా అర్రులు చాస్తున్నారన్న క్రమంలో ఆయా పార్టీల నాయకులు..కార్యకర్తలు వెల్లడిస్తున్న అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

131
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...