ప్రతి ఉద్యోగి సంతోషంగా ఉంటేనే..


Tue,September 11, 2018 01:46 AM

- ఉత్సాహంగా విధులు నిర్వహిస్తారు
అమ్రాబాద్ రూరల్ : ప్రతి ఉద్యోగి సంతోషంగా ఉన్నప్పుడే తన విధులను ఉత్సాహంగా నిర్వహించగలరని అటవీశాఖ రిటైర్డు ఐఎఫ్‌ఎస్ ఎం రాంప్రసాద్ పేర్కొన్నారు. మన్ననూర్‌లోగల వనమాలికలోని సీ బీట్‌లో జిల్లా అటవీశాఖ సిబ్బందికి.. హైదరబాద్‌లోని అటవీశాఖ శిక్షణా కేంద్రం దూలపల్లి డిప్యూటీ రేంజర్ ఉమారాణి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు వ్యక్తితత్వ వికాసంపై అవగాహన తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్ర మానికి ముఖ్యఅతిథిగా హాజరైన సైకాలజిస్టు, అటవీశాఖ రిటైర్డు ఐఎఫ్‌ఎస్ రాంప్రసాద్ మాట్లాడుతూ గురువులు అనేవారు ఏడు రకాలుగా ఉంటారని వారిని గౌరవించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. గు.. అనగా చీకటి, రు..అనగా రుచిత అంటే వెలుగు అని అర్థమన్నారు. చీకటిని తొలగించి వెలుగునింపేవాడు గురువన్నారు. ప్రతి వ్యక్తి జ్ఞానం పొందాలి, పొందిన జ్ఞానాన్ని తిరిగి ఇతరులకు అందిచినప్పుడే దాని విలువ మరింత రెట్టింపు అవుతుందన్నారు. అంతర్లీనంగా ఉన్న ఆత్మజ్యోతిని వెలిగించువాడే నిజమైన గురువన్నారు. వ్యక్తి జ్ఞానేంద్రీయాలను అదుపులో ఉంచుకొని చెడును జయించి మంచిని స్వీకరించడంతోనే పది మందికి దానిని పంచినవారమవుతామన్నారు. భూమిపై సుమారు 84 లక్షల జీవరాసులు ఉన్నాయని వీటన్నిటి మనుగడ కొనసాగినప్పుడు ప్రకృతి వైఫరీత్యాలు సంబవించవన్నారు. వీటన్నిలో మనిషి చాలా తెలివైనవాడని,

తన తెలివిని ఒక క్రమపద్ధతిలో వాడుకున్న వ్యక్తి ఉన్నతంగా ఎదుగుతాడని, ఎప్పుడైతే చెడుకు ప్రభావితుడవుతాడో వెంటనే తనకు తానుగా ప్రమాదంలో పడిపోతాడని వెల్లడించారు. ఈ దేశంలో సుమారు 30 కోట్ల మంది ఆకలి, విద్య కు దూరంగా ఉన్నారన్నారు. భారతదేశం గొప్పదే కాని చా మంది ఉద్యోగులు వారు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయపు పన్ను చెల్లించడం లేదని నూటికి 25 శాతం మంచివారైతే మిగిలిన 75 శాతం పన్ను ఎగవేతదారులు, అవీనితిపరులు ఉన్నారని తెలిపారు. ఏ ఉద్యోగం అయినా ఒక నిబద్ధతతో పనిచేసినప్పుడు, మనం చేస్తున్న పనిని సంతృప్తికరంగా చేసినప్పుడే నిజమైన సంతోషం ఉంటుందని వివరించారు. కార్యక్రమంలో జిల్లా అటవీశాఖ అధికారి జోజి, అమ్రాబాద్ డివిజనల్ అధికారి వెంకటేశ్వర్లు, రేంజర్లు ప్రభాకర్, శ్రీదేవి, డీఆర్‌వో లక్ష్మీకాంతరావు, దేవరాజు, సెక్షన్, బీట్ అధికారులు పాల్గొన్నారు.

106
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...