సాగులోకి పడావు భూములు


Tue,September 11, 2018 01:46 AM

పాన్‌గల్ : సీమాంధ్ర పాలనలో దశాబ్దాలుగా సాగునీరు లేక పడావుపడ్డ భూములను సా గులోకి తీసుకవచ్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం మండలంలోని మ ల్లాయిపల్లి,చింతకుంట,మాందాపూర్, దొం డాయిపల్లి గ్రామాల్లో భీమా, ఎంజీకేఎల్‌ఐ కాలువలను మంత్రి జూపల్లి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ మల్లాయిపల్లిలో తిమ్మయ్య చెరువు, ఎంజీకేఎల్‌ఐ కాలువకు సమాంతరంగా డిస్ట్రిబ్యూటరీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్కడక్కడా మైనర్ కాలువలు, బ్యాంకింగ్ వంతెనలు, డీ-8 కాలువ అంతర్నిర్మాణంలో భాగంగా ఏర్పాటు చేసిన మేజర్-4, 6 కాలువల పనులను పూర్తి చేయాలని సూచించారు. అవసరమున్న చోట సబ్‌కెనాళ్లను ఏ ర్పాటు చేసి కుంటలు, చెరువులను నింపాలని ఆదేశించారు. సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులు సకాలంలో స్పందించకుంటే తానే స్వంత ఖర్చులతో మిషన్లను ఏర్పాటు చేసి పనులు పూర్తి చేయిస్తానని రైతులకు హా మీ ఇచ్చారు. ఉమ్మడి పాలనలో సక్రమంగా నీటివాటా వాడుకోక తెలంగాణ రైతాంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, రైతన్నను రాజును చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నదన్నా రు. రాష్ర్టాన్ని 70 ఏళ్లు పాలించిన ఆంధ్రోళ్లు ఆగం చేశారని, టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలపట్ల ప్రజలనుంచి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశించిన బంగారు తెలంగాణ రావాలంటే మరోసారి పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ వెంకటేష్‌నాయుడు, జెడ్పీటీసీ రవి, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గోవర్ధన్‌సాగర్, సుదర్శన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, ఎంపీటీసీ కిరణ్‌కుమార్‌గౌడ్, మాజీ సర్పంచ్ కృష్ణయ్య, జనార్దన్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు వీరసాగర్, జగదీశ్వర్‌రెడ్డి, రామస్వామి, కొండల్, ఎంజీకేఎల్‌ఐ, భీమా అధికారులు పాల్గొన్నారు.

104
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...