పాముకాటుతో ఇద్దరి మృతి


Tue,September 11, 2018 01:46 AM

ధరూర్ : నెట్టెంపాడు పథకం, గ్రావిటీ కెనాల్‌లో పడిన బొలేరో వాహనం బయటకు తీస్తున్న క్రమంలో పాముకాటుకు గురై వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఓబులోంపల్లి గ్రామానికి చెందిన తిమ్మప్ప (40) అనే వ్యక్తి ఘటనలో మృతి చెందాడు. మండలంలోని ఓబులోంపల్లి గ్రామానికి చెందిన నర్సింలు బొలేరో వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి నెట్టెంపాడు కాలువలో పడవేసి వెళ్లారు. ఆదివారం వాహనాన్ని తీయడానికి ప్రయత్నించినా, భారీ క్రేన్ అందుబాటులో లేకపోవడంతో విరమించారు. తిరిగి సోమవారం క్రేన్ సహాయంతో వాహనాన్ని వెలికితీసే క్రమంలో ఉండగా, వాహన యజమాని అయిన నర్సింహులుకు వరుసకు పెదనాన్న అయిన తిమ్మప్ప కూడా కాలువలో ఉండి సహాయ చర్యల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రక్త పింజరి పాము కాటుకు గురయ్యాడు. తొడ ప్రాంతంలో తీవ్రమైన పాముకాటుకు గురైన తిమ్మప్పను గద్వాల ఏరియా దవఖానాకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు దవఖానాకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తిమ్మప్ప మృతి చెందాడు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం తిమ్మప్పను గద్వాల ఏరియా దవఖానాకు తీసువకచ్చారు. మృతుడికి భార్య సుజాత, నలుగురు సంతానం ఉన్నారు. ఇప్పటికే ఒకమ్మాయికియ వివాహం జరిగింది, ఇంకా ఇద్దరు మగ పిల్లలు, ఒక కూతురు ఉన్నది. కుటుంబ యజమాని ఊహించని విధంగా పాముకాటు రూపంలో మృతి చెందడంతో కుటుంబసభ్యలలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా తిమ్మప్ప పేరున పట్టాదారు పాసు పుస్తకం ఉన్నందున రైతు భీమా పథకం కింద ఇన్సూరెన్స్ వస్తుందని, స్థానికులు తెలిపారు.

115
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...