చికిత్స పొందుతూ యువకుడి మృతి


Tue,September 11, 2018 01:46 AM

కోడేరు : కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సోమవారం వెలుగు చూసింది. కోడేరు మండలం జనుంపల్లి గ్రామానికి చెందిన యువకుడు కృష్ణయ్య (30) అనే యువకుడు ఫైనాన్స్‌లో ట్రాక్టర్ తీసుకున్నాడు. ఫైనాన్స్ వారికి కొన్ని నెలలు వాయిదాలు సక్రమంగా చెల్లించకపోవడంతో వారు ట్రాక్టర్‌ను తీసుకుపోయారు. దీంతో ఈ నెల 7న ఇంట్లో ఒంటిపై కిరిసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గుర్తించి నాగర్‌కర్నూల్ దవాఖానకు తీసుకుపోయారు. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతున్న కృష్ణయ్య సోమవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతునికి భార్య అన్నపూర్ణతో పాటు ఒక కుమారుడు ఉన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...