రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి


Tue,September 11, 2018 01:45 AM

అమ్రాబాద్ రూరల్ : బైక్ చెట్టుకు డీకొట్టడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెంద గా మరో వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన సోమవారం రాత్రి మండలంలోని అచ్చంపేట-మద్దిమడుగు ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. అ మ్రాబాద్ మండల కేంద్రానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ అంజమ్మ భర్త దాసరి వెంకటేశ్, ఇదే మండలంలోని వెం కటేశ్వర్లు బావి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ దాసరి రాజులు కలిసి బైక్‌పై మన్ననూర్ గ్రామానికి వచ్చి సోమవారం రాత్రి తిరిగి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో దాసరి వెంకటేశ్(38) తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే దాసరి రాజు కు కూడా తల భాగంలో గా యం కావడంతోపాటు ఎడమకాలు, ఎడ మ చెయ్యి విరిగిందన్నారు. గాయపడిన రాజును ఆర్‌డీటీ అంబులెన్స్‌లో అచ్చంపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ఈగలపెంట ఎస్సై బద్యానాయక్, అమ్రాబాద్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమ్రాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడు వెంకటేశ్‌కు ఇద్దరు భార్యలు, ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుడు వెంకటేశ్ టీఆర్‌ఎస్ పార్టీ క్రీయాశీలక సభ్యుడు, మండలంలో పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, అలాంటి వ్యక్తిని ప్రమాద రూపంలో కోల్పోవడం చాలా బాధాకరం అన్నారు.

95
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...