కందనూలులో కారు జోష్


Mon,September 10, 2018 02:35 AM

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి: కందనూలు జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని కలిగి ఉంది. తెలంగాణ రా ష్ర్టాన్ని సాధించి ప్రజల విశ్వాసాన్ని చూరగొని అధికారంలోకి వచ్చాక బంగారు తెలంగాణ సాధనలో నాలుగేళ్ల పరిపాలనతో ప్రజల్లో ఆ విశ్వాసం మరింత పెరిగింది. గత ఏడు దశాబ్దా ల్లో జరగని అభివృద్ధి, సంక్షేమ పథకాలు కేవ లం ఈ నాలుగేళ్లలోనే సీఎం కేసీఆర్ హయాం లో జరగడం గమనార్హం. ముఖ్యంగా జిల్లాలో వలసలు, కరువు దూరమవడం విశేషం.
వ్యవసాయానికి మంచిరోజులు..
ప్రభుత్వం వ్యవసాయానికి పెద్ద పీట వేయడంతో జిల్లాలో వ్యవసాయం సంక్షోభం నుంచి సంక్షేమంగా మారింది. ఇందులో భాగంగా దశాబ్దానికిపైగా పెండింగ్‌లో ఉన్న ఎంజీకేఎల్‌ఐ ప్రాజెక్టును 2015సంవత్సరంలోనే ప్రా రంభించారు. జొన్నలబొగుడ, గుడిపల్లి రిజర్వాయర్ల ప్రారంభంతో జిల్లాలో ప్రతి సంవత్సరం 2లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోంది. వేరుశనగ, పత్తి, వరిలాంటి పంటల సాగు గణనీయంగా రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో ఉత్ప త్తి సాధించింది. అలాగే 24గంటల కరెంట్‌తో పాటుగా ఇటీవలే రైతు బీమా, ఎకరాకు రూ.4 వేల పెట్టుబడిలాంటి పథకాల అమలుతో రైతుల్లో ప్రభుత్వం పట్ల సానుకూలత ఏర్పడిం ది. ఇక పాలమూరు ఎత్తిపోతల పథకంలో భా గంగా నార్లాపూర్ (5.41టీఎంసీలు), వట్టెం లో (14.37టీఎంసీలు) భారీ రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోంది.
ఈ పథకాలు పూర్తైతే జిల్లాలో అదనంగా మరో 2లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశముంది. ఈ ప్రాజెక్టులతో జిల్లాలో భూగర్భ జలమట్టం కూడా పెరిగింది. కొల్లాపూర్‌లో 3మీటర్లలోనే నీళ్లు లభిస్తుండటం గమనార్హం. సాధారణంగా వేసవి లో ఉండే తాగునీటి సమస్య కూడా దూరమయ్యింది. ఇక వాటర్‌గ్రిడ్ పథకం దాదాపు 80శాతం పూర్తైంది. మరో నెలలో ప్రజలందరికీ శుద్ధ జలం అందనుంది. మిషన్ కాకతీయ ద్వారా నాగర్‌కర్నూల్ మినీ టాంక్‌బండ్, రుసూల్ చెరువులు అభివృద్ధి చెందుతున్నాయి. పాలెంలో బీఎస్సీ అగ్రికల్చరల్ కళాశాల మంజూరైంది. ముఖ్యంగా నాగర్‌కర్నూల్ జిల్లాగా ఆవిర్భవించి రెండేళ్లు విజయవంతంగా పాలన జరిగి ప్రజలకు పథకాలు అమలవుతున్నాయి. ఇలా మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, కంటి వెలుగు, కేసీఆర్, బాలికా ఆరోగ్య రక్ష కిట్‌లాంటి విద్య, వైద్యం, సంక్షేమంలాంటి ఎన్నో పథకాలు అర్హులందరికీ అందుతుండటంతో టీఆర్‌ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్‌తో పాటుగా మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి పట్ల నమ్మకం పెరిగింది.

161
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...