బాధితులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ


Mon,September 10, 2018 02:33 AM

బిజినేపల్లి : మండలంలోని టీఆర్‌ఎస్ కార్యాలయంలో ఆదివారం 9మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎంపీపీ రాములు, వైస్ ఎంపీపీ కుర్మయ్య అందజేశారు. లట్టుపల్లికి చెందిన సులోచనకు రూ.లక్ష, నాన్ నాయక్‌కు రూ.34వేలు, బిజ్యానాయక్‌కు రూ.14వేలు, వసంతాపూర్ అన్నపూర్ణకు రూ.75వేలు, మంగనూరు సాయమ్మకు రూ.60వే లు, ఖానాపూర్ సిద్ధోజికి రూ.50వేలు, వసంతాపూర్‌కు చెందిన అంజనమ్మకు రూ.38వేలు, వట్టెంకు చెందిన ఇఫ్రాన్‌కు రూ.19వేలు, గంగారంకు చెందిన మధోని నాయక్‌కు రూ.13వేలు చొప్పున దాదాపు రూ.4లక్షలకు పైగా చెక్కులను అందించారు. కార్యక్రమంలో నాయకులు బాలరాజుగౌడ్, రమణారావు, గోపాల్, వెంకన్న, వెంకటయ్య, భద్రయ్య, శ్రీనివాస్, పాల్గొన్నారు.

సస్యశ్యామలంగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్‌దే..
పాన్‌గల్ : పెండింగ్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయించి సస్యశ్యామలంగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం మండలంలోని కిష్టాపూర్, గోప్లాపూర్, మాధవరావుపల్లి, తెల్లరాళ్లపల్లి మీదుగా డీ-8 ద్వారా వెళ్లే మేజర్-6 కెనాల్‌ను మంత్రి జూపల్లి అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మా ట్లాడుతూ మండలంలో 10.56 కిలోమీటర్ల పొడవున మేజర్-6 కాలువ ఉంటుందని, దీని ద్వారా మూడు వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. ఇప్పటి వరకు అరకిలోమీటర్ మేర మా త్రమే కాలువ పనులు చేపట్టడంపట్ల కాంట్రాక్టర్ వెంకట్రావ్‌పై మండిపడ్డారు.

నత్తనడకన పనులు జరిగితే రై తులకు సాగునీరు ఎలా చేరుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యుద్ధప్రాతిపాదికన కాలువ నిర్మాణ పనులు చేపట్టి మేజర్, మైనర్, బ్యాంకింగ్, బ్లాస్టింగ్ తదితర పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు. పది రోజుల్లో పొల్కిచెరువుకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనులు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. అవసరమైతే స్వంత డబ్బులతో అద్దెకు మిషన్లు తెప్పించి పనులు పూర్తి చేయిస్తానని పేర్కొన్నారు. గోప్లాపూర్, మాధవరావుపల్లి, పాన్‌గల్, ఆకులోనిపల్లి, దవాత్కాన్‌పల్లి గ్రామాలకు నీరందితే మండలం మొ త్తం సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉందన్నారు. కా లువ పనులకు రైతులు అడ్డుపడొద్దని, భూములు కో ల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని చెల్లిస్తుందని తెలిపారు.

టీఆర్‌ఎస్ సర్కార్‌లోనే అన్ని వర్గాల అభివృద్ధి..
టీఆర్‌ఎస్ సర్కార్ హయాంలోనే అన్ని వర్గాలకు మేలు చేకూరిందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. దేశం లో ఎక్కడా లేని విధంగా అన్ని కులాల వారికి సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. అభివృద్ధిని చూసి ఆశీర్వదించాలని, రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే ఘన విజయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఆరుమార్లు ఎమ్యెల్యే, మూడోమారు మం త్రిగా పనిచేసి మరోమారు ఎమ్మెల్యే టికెట్ లభించడంపట్ల పాన్‌గల్, మాధవరావుపల్లి గ్రామస్తులు సంతో షం వ్యక్తం చేస్తూ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ వెం కటేష్‌నాయుడు, జెడ్పీటీసీ రవి, సింగిల్‌విండో చైర్మన్ బాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ భాస్కర్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ బాలరాజు, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు గోవర్ధన్‌సాగర్, పుల్లారావు, బాలరాజు, గ్రామాధ్యక్షుడు తిరుపతయ్య, ఎంపీటీసీ రాంచందర్ యాదవ్, కో ఆప్షన్ సభ్యుడు యూనిస్కా న్, నాయకులు రవీందర్‌రెడ్డి, నర్సింహ, రామస్వామి, ఎంజీకేఎల్‌ఐ అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

93
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...