జూరాలకు స్వల్ప వరద


Mon,September 10, 2018 02:32 AM

జోగుళాంబ గద్వాల, నమస్తే తెలంగాణ ప్రతినిధి: జూరాలకు స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఆదివారం జురాల ఇన్‌ఫ్లో 16,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 43,314 క్యూసెక్కులు నమోదైంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 1,044.980 అడుగుల ఎత్తులో 9.645 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి కాలువ ద్వారా 795 క్యూసెక్కులు, ఎడమ కాలువ ద్వారా 1400 క్యూసెక్కులు, సమాంతర కాలువ ద్వారా 835 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భీమా లిఫ్ట్-1 ద్వారా 1300 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2 ద్వారా 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్ లిఫ్ట్ ద్వారా 315 క్యూసెక్కులు నీటిని ఎత్తిపోస్తున్నారు. విద్యుదుత్పత్తి కోసం పవర్ హౌజ్ ద్వారా 8,366 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువనున్న కర్ణాటకలోని ఆల్మట్టి ఇన్‌ఫ్లో 18,900 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 18,900 క్యూసెక్కులు నమోదైంది. నారాయణపూర్ ఇన్‌ఫ్లో 16,907 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 17,264 క్యూసెక్కులు నమోదైంది. తుంగభద్ర ఇన్‌ఫ్లో 7,909 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 11,026 క్యూసెక్కులు నమోదైంది.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...