నేడు జిల్లాకు మర్రి రాక


Mon,September 10, 2018 02:30 AM

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : కందనూలుకు మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి రానున్నారు. అసెంబ్లీ రద్దు తర్వాత తొలిసారిగా నియోజకవర్గంలో అడుగు పెడుతున్న మర్రికి ఘన స్వాగతం పలికేందుకు నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేపట్టాయి. సీఎం కేసీఆర్ సహకారంతో తొలిసారిగా ఎమ్మెల్యేగా పని చేసినా ఆశించినదానికంటే అధికంగా అభివృద్ధి పనులు చేసి ప్రజాభిమానం చూరగొన్న మర్రి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మరోమారు ఎన్నికల బరిలో నిలవబోతున్న నేపథ్యంలో ప్రజలంతా సాదర స్వాగతం పలకబోతున్నారు.

కందనూలు దిక్సూచి మర్రి..
నాగర్‌కర్నూల్ నియోజకవర్గం అభివృద్ధికి ఆదర్శంగా మారింది. ఎమ్మెల్యేగా పని చేసిన నాలుగేళ్ల కాలంలో మర్రి జనార్దన్ రెడ్డి హయాంలో రూ.వం దల కోట్ల నిధులతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు గత ముప్పై ఏళ్లుగా అమలు జరిగాయి. ఇందులో ప్ర ధానంగా 2016అక్టోబర్ 11న కందనూలు జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. దీంతో నియోజకవర్గ ప్రజలతో పాటుగా అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి ప్రజలకు పథకాల అమలు పకడ్బందీగా జరుగుతోంది. ఇక ఎంజీకేఎల్‌ఐ పథకం వల్ల దాదాపు 80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. గ్రామాల్లో పచ్చని వాతావరణం ఏర్పడింది. ప్రతి సంవత్సరం 200వరకు చెరువులు నిండుతున్నాయి. దీనివల్ల తాగునీటి సమస్య దాదాపుగా తీరింది. వట్టెంలో పాలమూరు ఎత్తిపోతలలో భాగంగా 21టీఎంసీల భారీ రిజర్వాయర్ నిర్మాణం జరుగుతోంది. గత డిసెంబర్‌లో జల విజయ యాత్ర పేరుతో నియోజవర్గంలో పర్యటించి రైతులతో మమేకమయ్యారు. ఇక మిషన్ భగీరథ ద్వారా గ్రామాలకు మంచినీరు చేరుకుంటోంది. జిల్లా కేంద్రం అభివృద్ధికి కానాచిగా మారింది. రూ.18కోట్లతో మినీ టాంక్‌బండ్ పనులు రాష్ట్రంలోనే ప్రత్యేకంగా నిలుస్తున్నాయి.

హైదరాబా ద్ తర్వాత మినీ టాంక్‌బండ్‌లో రూ.65లక్షల సొం త నిధులతో బుద్ధ విగ్రహం, రూ.1.25కోట్లతో వాటర్ లైటింగ్ షోను మర్రి చేయిస్తున్నారు. ఇక నెల్లికొండ శివారులో 10వేల మెట్రిక్ టన్నుల నూతన మార్కెట్ గోదాం నిర్మాణం పూర్తి కావచ్చింది. పట్టణంలో సెంట్రల్ లైటింగ్, డివైడర్, అందులో పచ్చని మొక్కలు, జెడ్పీ,కళాశాల మైదానాల్లోరూ.50లక్షలతో ఎల్‌ఈడీ లైట్లు, ఇటీవలే పట్టణంలో భూగర్భ డ్రైనేజీ పనులకు రూ.65కోట్ల మంజూరు జరిగింది. అలాగే నల్లవెల్లి రోడ్డు, తెలకపల్లి నుంచి జమిస్తాపూర్, లింగాలతో పాటుగా ఇంద్రకల్ నుంచి జడ్చర్ల డబుల్ రోడ్లు పూర్తయ్యాయి. అన్ని మండలాల్లో వ్యవసాయ గోదాంలు నిర్మాణమయ్యాయి. సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరులో రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. అనారోగ్య సమస్యలతో దవాఖానల్లో చేరుతున్న వారికి సాయం చేయడంలో మర్రి ముందుంటున్నారు. కందనూలు దవాఖానను ఆధునీకరించడం జరిగింది. డయాలసిస్, ఐసీయూ, క్యాన్సర్ స్క్రీనింగ్, రక్తనిధి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దవాఖాన అభివృద్ధికి రూ.30లక్షల సొంత డబ్బులు అందజేశారు.

ఇక ఎంజేఆర్ ట్రస్టు ద్వారా 332మంది పేద జంటలకు ఘనంగా పెళ్లిళ్లు, పోలీసు, ఉపాధ్యాయ, ఉద్యోగ శిక్షణలు ఇప్పించి వేలాది మంది నిరుద్యోగులకు సహాయం చేశారు. ఇక ప్రభుత్వం అమలు చేసిన ఆసరా, ఆహారభద్రత, రైతుబంధు, వ్యవసాయ పెట్టుబడి, 24గంటల కరెంట్, కల్లుగీత కార్మికులకు పింఛన్లు, కేసీఆర్ కిట్, బాలికా ఆరోగ్య రక్ష కిట్‌లాంటి పథకాలతో నియోజకవర్గ ప్రజల్లో మర్రికి ఆదరణ పెరిగింది. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలైన ఎంజీకేఎల్‌ఐ, జిల్లాలను సాధించారు. ఆదరణ కోల్పోయిన ఇంజనీరింగ్ కళాశాలకు బదులుగా పాలిటెక్నిక్ కళాశాల మంజూరు కాబోతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ రద్దుకాగా తొలిసారిగా నియోజకవర్గానికి వస్తున్న మర్రికి ఘనంగా స్వాగతించేందుకు నియోజకవర్గ ప్రజలు, టీఆర్ నేతలు, యువత సిద్ధమయ్యారు. సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాలతో పాటుగా వ్యక్తిగతంగా సాధించుకున్న పేరుతో రాబోయే ఎన్నికల్లో మర్రికి మరోమారు విజయాన్ని కట్టబెట్టేందుకు ప్రజానీకం కదులుతున్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...