వంద స్థానాలు టీఆర్‌ఎస్ కైవసం


Sun,September 9, 2018 02:07 AM

అమ్రాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ సారధ్యంలో శాసన సభ ఎన్నికల్లో వందకు పైగా సీట్లు సాధించి రికార్డు నెలకొలుపుతామని టీఆర్‌ఎస్ మాజీ శాసన సభ్యులు గువ్వల బాలరాజు అన్నారు. శనివారం అమ్రాబాద్ మండల కేంద్రంలో పార్టీ కార్యాయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రా పాలకులు ఓట్లు వచ్చినప్పుడు దండుకోని సంక్షేమాన్ని, అభివృద్ధిని మరిచి ఆగంచేస్తున్న తరుణంలో దైవ దూతగా వచ్చిగా కేసీఆర్ కేంద్రం మెడలు వంచి తెలంగాణను సాధించిన విషయాన్ని గుర్తుచేశారు. బంగారు తెలంగాణ చేసి అందరి భవిష్యత్తులో వెలుగులు నింపేందుకు కృషిచేస్తుంటే రాబంధుల్లా వెంటాడుతూ ఆంధ్రా పార్టీలు ఏకం కావడం యావత్ తెలంగాణ ప్రజలు క్షమించరాని నేరమి ఆయన దుయ్యబట్టారు. ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రాజెక్టులను నిర్మిస్తుంటే అడుగడుగునా ఆంధ్రా పెత్తందారులు కోర్టులలో కేసులు వేసి అభివృద్ధిని అడ్డుపడుతున్నారన్నారు.

అచ్చంపేట నియోజకవర్గంలో గతంలో పురపాలక ఎన్నికల్లో వందశాతం ఫలితాలు సాధించామని, శాసనసభ ఎన్నికల్లోనూ అత్యధిక మెజార్టీతో గెలిపించి నల్లమల గడ్డపై గులాబీ జెండాను శాశ్వతంగా ఎగురవేయాలని కోరారు. నియోజకవర్గంలో 70వేల ఎకరాలకు నీరు అందించామని, అమ్రాబాద్, పదర మండలాలకూ సాగునీరు కోసం ప్రత్యేక లిఫ్ట్ ద్వార 2.06 టీఎంసీల నీరు అందిస్తామన్నారు. అంతకముందు మండలంలో మొల్కమామిడి, ఈదులబావి గ్రామాలలో జరిగిన ప్రైవేటు కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ మండల అధ్యక్షుడు చెన్నకేశవులు, పదర అద్యక్షుడు రాంబాబు, వర్కింగ్ అధ్యక్షుడు మల్లేశ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాజారాం, నేతలు రవీందర్‌రెడ్డి, రాములు, ఆంజనేయులు, తిరుమలయ్య, మల్లేశ్, రవిందర్, కుమార్, రామకృష్ణ, భారతి, పాపయ్య తదితరులు పాల్గొన్నారు.

107
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...