లక్ష్యసాధనకు కృషి చేయాలి


Sun,September 9, 2018 02:07 AM

కల్వకుర్తి రూరల్ : విద్యార్థులు తమ లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా కృషి చేయాలని పాలమూరు యూనివర్సిటీ రిజి్రస్ట్రార్ పాండురంగారెడ్డి, కల్వకుర్తి డీఎస్పీ పుష్పారెడ్డిలు అన్నారు. శనివారం కల్వకుర్తి పట్టణంలోని స్వాతి ఫంక్షన్‌హాల్‌లో శ్రీ కృష్ణవేణి డిగ్రీ కళాశాల సీనియర్ విదార్థులు, నూతనంగా కళాశాలలో చేరిన విద్యార్థులకు ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి పీయూ రిజిష్ర్టార్ పాండురంగారెడ్డి, కల్వకుర్తి డీఎస్పీ పుష్పారెడ్డిలు ముఖ్యఅతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వళన చేశారు. అనంతరం మాట్లాడుతూ అమలు చేస్తున్న సెమిస్టర్ విధానం పైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులు నిత్యం వార్తా పత్రికలు చదువుతూ రాష్ట్ర, దేశ, ప్రపంచస్థాయి విషయాలను సామాజిక సమస్యలను అవగతం చేసుకుంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధ్దం కావాలన్నారు. సేవా కార్యక్రమాలలో భాగస్వాములై గ్రామంలో మూడనమ్మకాలు, బాల్యవివాహాలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. కళాశాలలో టీజింగ్ ర్యాగింగ్ వంటి కార్యక్రమాలను నిర్వహించకుండా విద్యార్థులతో స్నేహసంబంధాలను కొనసాగించాలని పాశ్చాత్య వీడాలన్నా. విద్యార్థులు విద్యతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ వంటి కోర్సులను చేయడం ద్వారా త్వరగా ఉపాధి కళాశాల టాపర్స్‌కు మెడల్స్, నగదు ప్రోత్సాహకాలను అందించారు. విద్యార్థులు కార్యక్రమాలతో
ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేస్తున్నాం

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 21 ప్రభుత్వ జూనియర్, డిగ్రీ 62 ప్రైవేట్ కళాశాలలు, 4 సోషల్‌వెల్ఫేర్ కళాశాలలు ఉన్నాయని ప్రభుత్వ కళాశాలలో సమగ్రంగా వసతులు కల్పించి వాటిని బలోపేతం చేసేందుకు కృషి చేస్తునట్లు రిజిస్ట్రార్ తెలిపారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో తప్పనిసరిగా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని బయో మెట్రిక్ అమలు చేయని కళాశాలల గుర్తింపును రద్దు చేస్తామన్నారు. ప్రతి కళాశాలలో ల్యాబ్, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, ప్రభుత్వ నిబంధనల ప్రకారం తప్పనిసరిగా ఉండాలని లేని కళాశాలలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. డిగ్రీ కోర్సులలో చేరని విద్యార్థుల జాబితాను యూనివర్సిటీకి సరెండర్ చేయాలని అవసరమైన విద్యార్థులకు వారు కోరిన కోర్సులలో అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ కిష్టారెడ్డి, వెంకట్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, అధ్యాపకులు తదితరులు ఉన్నారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...