విద్యార్థులు కనిపించడం లేదని ఫిర్యాదు


Sun,September 9, 2018 02:06 AM

మహబూబ్‌నగర్ క్రైం : జిల్లా కేంద్రంలోని ఓ ప్రవేట్ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు పదో తరగతి విద్యార్థులు కనిపించడం లేదని తల్లిదండ్రులు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి ఎస్సై భాస్కర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ మండలంలోని దోడ్డలోనిపల్లికి చెందిన డి.రాములు తన కుమారుడు రాహుల్‌ను జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ లుంబిని హై స్కూల్‌లో పదో తరగతి చదివిస్తున్నాడు. అయితే రోజు మాదిరిగానే రాహుల్ స్కూల్‌కి వెళ్లాడు. అయితే పాఠశాలలో స్నేహితుల మధ్య జరిగిన గొడవలో ఉపాధ్యాయులు రాహుల్‌ను మందలించారు. దీంతో భయాందోళనకు గురైన రాహుల్ మరో విద్యార్థి వడ్డె శేఖర్‌తో కలిసి పాఠశాలను నుంచి చెప్పకుండా వెళ్లిపోయాడు. రాహుల్ తండ్రి రాములు పాఠశాలకు వచ్చి తన కుమారుడిని పిలిపించాలని సిబ్బందిని కోరగా, ఇక్కడ లేడని వారు తెలిపారు. ఎక్కడ వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...