విద్యార్థిని చితకబాదారు


Sun,September 9, 2018 02:05 AM

నాగర్‌కర్నూల్ క్రైం : లెక్చరర్‌ను అసభ్యంగా మాట్లాడాడనే నెపంతో ఇంటర్మీడియెట్ సెకండీయర్‌కు చెందిన ఓ విద్యార్థిపై కళాశాల యాజమాన్య మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని గీతాంజలి జూనియర్ కళాశాలలో శనివారం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి విద్యార్థి తల్లిదండ్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ సమీపంలో కొనసాగుతున్న గీతాంజలి కళాశాల రెండవ శనివారం సెలువు అయినప్పటికీ కళాశాల తరగతులు కొనసాగించారు. తరగతులు పూర్తి చేసుకొని వెళ్లిపోతున్న క్రమంలో నాగర్‌కర్నూల్ మండలం కుమ్మెర గ్రామానికి చెందిన విద్యార్థి హనుమాండ్ల ఆదిత్య అనే విద్యార్థి లెక్చరర్ నవీన్‌పై అసభ్యంగా మాట్లాడాడనే ఉద్దేశ్యంతో లెక్చరర్ మందలించి కొట్టాడు. ఇదేక్రమంలో విద్యార్థి కోపంతో ఆ లెక్చరర్‌పై మరింత దురుసుగా ప్రవర్తించాడనే నెపంతో కళాశాల డైరక్టర్ సునీంద్రకుమార్, లెక్చరర్లు నవీన్, లక్ష్మణాచారి, రమేశ్‌లు ప్లాస్టిక్ పైపులతో విద్యార్థిని వికక్షణా రహితంగా మూకుమ్మడిగా దాడి చేసినట్లు విద్యార్థి తండ్రి పేర్కొన్నారు. నలుగురు కలిసి కాళ్లతో విచక్షణా రహితంగా తన్నారన్నారు. విద్యార్థి స్పృహతప్పి పడిపోవడంతో యాజమాన్యమే జిల్లా కేంద్రంలోని మమత సుబ్బారెడ్డి దవాఖానకు, అక్కడి నుంచి ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్సలు చేయించారు. అనంతరం తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు కళాశాలకు చేరుకొని యాజమాన్యంపై మండిపడ్డారు. విద్యార్థికి స్కానింగ్ తీయించి కడుపులో పేగులు ఒడిపడినట్లు, కుడికాలు విరిగినట్లు గుర్తించిన డాక్టర్లు మెరుగైన వైద్యం కోసం మహబూబ్‌నగర్‌కు తరలించారు.

కళాశాలకు నోటీసులు జారీ..
ఇదిలా ఉండగా రెండవ శనివారం అయినప్పటికీ కళాశాల నిర్వహించడంపై జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటరమణ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. సెలవు రోజున ఎందుకు కళాశాల తరగతులు నిర్వహించారనే దానిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సెలవురోజున కళాశాల నిర్వహించడం మొదటి తప్పు అయితే, విద్యార్థి తప్పు చేస్తే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని, లేదా టీసీ ఇచ్చి పంపాలే కానీ దాడి చేయడం ఏమిటని డీఐవో మండిపడ్డారు. ఇదిలా వుండగా విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కళాశాల డైరెక్టర్ సునీంద్రకుమార్, లెక్చరర్లు నవీన్, రమేశ్, లక్ష్మణాచారిలపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై భగవంత్‌రెడ్డి తెలిపారు.

83
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...