పేదింట వెలుగులు


Sat,September 8, 2018 02:44 AM

నాగర్‌కర్నూల్, నమస్తే తెలంగాణ ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం పేదలను ఆదుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే వినూత్న పంథా అనుసరిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కారు చీకట్లను పారదోలడం జరిగింది. ఈ క్రమంలో రాష్ట్రంలో రైతులకు 24గంటల ఉచిత కరెంట్ అందుతోంది. జిల్లాలో ఇలా 64వేలకుపైగా వ్యవసాయ కనెక్షన్లు ఉన్న రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం కందనూలు జిల్లా పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో 1.27లక్షల నివాసాలకు, 1,479పారిశ్రామిక కనెక్షన్లు, 14,173వాణిజ్య కనెక్షన్లు చొప్పున మొత్తం 2లక్షల కరెంట్ కనెక్షన్లు ఉన్నాయి. ఇదిలా ఉండగా తాజాగా గ్రామీణ పేద ఎస్సీ, ఎస్టీ ఇండ్లకూ 101యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు సీఎం నిర్ణయించడం గమనార్హం. సీఎం కేసీఆర్ ఈ మేరకు గత వారం రోజుల క్రితం ప్రకటన చేయడం ఆ వర్గాల్లో ఆనందాన్ని నింపింది. జిల్లాలోని 8వేల మందికిపైగా ఎస్సీలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఇప్పటికే ఎస్సీలకు ఈ పథకం ద్వారా 50యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతోంది. దీనివల్ల ప్రతి నెలా ఆ కుటుంబాలకు రూ.6.70లక్షలు ఆదా అవుతోన్నాయి. ఇకపై ఈ కుటుంబాలకు 101యూనిట్ల ఉచిత విద్యుత్ అందనుంది. కాగా ఎస్టీలకు తొలిసారిగా ఈ పథకం వర్తించనుండటం గమనార్హం.

ఇప్పటి వరకూ గిరిజనులకు ఏ రాష్ట్రంలో లేని విధంగా తొలిసారిగా 101యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించడం శుభ పరిణామం. జిల్లాలో ప్రాథమిక అంచనా ప్రకారం 4,878గిరిజన కుటుంబాలుండగా 3,504మందికి ఈ పథకం ద్వారా లబ్ధి కలగనుంది. ఇందుకోసం ప్రతి నెలా రూ.3.50లక్షలు ఆదా కానున్నాయి. ప్రస్తుతం విద్యుత్ ఉపకరణాల వినియోగం గత నాలుగైదేళ్ల కంటే విపరీతంగా పెరిగింది. ప్రతి ఒక్క కుటుంబంలో ఓ టీవీ, కూలర్‌లాంటి గృహోపకరణాలతో పాటు మూడు వరకు స్మార్ట్ ఫోన్లు ఉండటం సాధారణంగా మారింది. మారుమూల పల్లెల్లో, అటవీ ప్రాంతాల్లో సైతం సైతం డైరెక్ట్ టూ హోం ద్వారా టీవీలు చూస్తున్నారు. దీనివల్ల కరెంట్ వాడకం కూడా పెరుగుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్ 101యూనిట్ల విద్యుత్‌కు ని ర్ణయించారు. ఫలితంగా ఎస్సీ, ఎస్టీ వర్గీయుల్లో హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో 9,647 ఎస్సీ సర్వీసులు ఉన్న కుటుంబాలకు గాను 8,162 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. అదే ఎస్టీల్లో 4,878కుటుంబాలకు గాను 5,504కుటుంబాలకు ప్రయోజనం కలగనుండ టం గమనార్హం. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆసరా, ఆహార భద్రత, నిరుద్యోగ యువతకు కార్పొరేషన్ల ద్వారా రుణాలు, హా స్టళ్లు, గురుకుల పాఠశాలలు, కళాశాలల ఏర్పాటు లాం టి ఎన్నో సౌకర్యాలను కలిపిస్తోంది. ఈ క్రమంలో తా జాగా 101యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించనుండటం ఆ వర్గాల ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తోంది.

ఉచిత కనెక్షన్‌తోపాటు ఉచిత విద్యుత్
ఎస్సీ, ఎస్టీలకు కరెంట్ కనెక్షన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగానే అందజేస్తోంది. పేదలు చాలా మంది విద్యుత్ కనెక్షన్లు లేక అంధకారంలోనే ఉండటాన్ని గుర్తించిన ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకొంది. గతంలో రూ.125 చెల్లిస్తే కరెంట్ కనెక్షన్ ఇస్తుండగా తాజాగా ఆ డబ్బులు కూడా లేకుండానే ఉచితంగా కనెక్షన్ ఇస్తున్నారు. అయితే ప్రతి నెలా రూ.25చొప్పున ఐదు నెలల పాటు బిల్లు రూపంలో విద్యుత్ శాఖ కనెక్షన్ డబ్బులు వాయిదాల పద్దతిలో తీసుకోనుంది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ పేదలకు ఎంతో లబ్ధి కలగనుంది. ఒక్క మీటర్ కనెక్షన్ కోసం దాదాపు రూ.5వేలు చెల్లించాల్సి ఉండగా పూర్తి ఉచితంగా వ స్తున్న ఈ పథకంతో ఎస్సీ, ఎస్టీ కాలనీలు కాంతి వం తంగా మారనున్నాయి. ఇందులో భాగంగా దరఖాస్తు చేసుకున్న పేదలకు ఒక మీటర్, సర్వీస్ వైరు, ఒక ఎల్‌ఈడీ బల్బు, ఆ బల్బు వెలిగేందుకు వైరింగ్‌తో పాటు దూరంగా ఉన్నట్లయితే స్తంభాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా ఎస్సీ, ఎస్టీల ఇండ్లల్లో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రజల్లో సంతోషం కనిపిస్తోంది.

79
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...