మంటకలిసిన మానవత్వం


Sat,September 8, 2018 02:43 AM

చారకొండ : నవమాసాలు మోసిన కన్నతల్లి బిడ్డ భారమైందని వదిలేసిందో.. లేదా ఆడబిడ్డ అని వదిలేసిందో.. కానీ పది రోజులు కూడా నిండని ఆ పసికందు అడవిలో అనాథగా వదిలేసి మానవత్వాకినే మాయని మచ్చను తీసుకువచ్చారు. తల్లి పొత్తిళ్లలో జోల పాటలతో నిద్ర పోవాల్సిన ఆ చిన్నారి అడవిలో చీమల బారిన పడి ఏడుస్తూ కనిపించిన ఘటన శుక్రవారం గోకారం శివారులోని ఫారెస్టులో వెలుగు చూసింది. చారకొండ హెడ్ కానిస్టేబుల్ మోతీలాల్ తెలిపిన వివరాల ప్రకారం.. గో కారం గ్రామానికి వెళ్ల్లే మార్గంలో ఫారెస్ట్ లో ఉన్న మైసమ్మ దేవాలయం ముందు పది రోజుల ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలేసి వెళ్లారు. గోకారం గ్రామానికి చెందిన వ్యక్తులు గ్రామానికి వెళ్తుండగా పసిపాప ఏడుపు విని వెళ్లి చూ డగా పాపను వదిలేసి చాలా సమయం కావడంతో ఆ పాపకు చీమలు పట్టి ఉన్న ట్లు గుర్తించారు. దీంతో వారు పాపను తీసుకొని చీమల బారి నుంచి రక్షించి పాలను పట్టించారు. వదిలేసిన వెళ్లిన వారు ఆ పాప పక్కనే పాలసీసాను కూడా ఉంచి వెళ్లారు. ఈ విషయాన్ని గ్రామస్తు లు పోలీసులకు సమాచారం అందించడంతో తాము అక్కడికి చేరుకొని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పద్మావతిని పిలిపించి పాపను వారికి అప్పగించినట్లు చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పాపను ఐసీడీఎస్ సిబ్బంది మహబూబ్‌నగర్‌లోని శిశు విహార్‌కు తరలించారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...