యాంత్రీకరణతో అధిక దిగుబడులు


Sat,September 8, 2018 02:43 AM

-సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడమే లక్ష్యం
-వరినాటు యంత్రాలతో రైతులపై తగ్గనున్న భారం
-వ్యవసాయ పరిశోధన సంచాలకులు జగదీశ్వర్
బిజినేపల్లి : యాంత్రీకరణతో అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసా య పరిశోధన సంచాలకులు జగదీశ్వర్ అన్నారు. శుక్రవారం పాలెం ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంతీయ పరిశోధన కేం ద్రంలో వ్యవసాయ శాఖ నాగర్‌కర్నూ ల్ ఆధ్వర్యంలో పాల్తిన్ ఫిట్‌పై వరినా రు పెంచడం, యాంత్రీకరణ పద్దతుల్లో వరినాట్లు అనే అంశంపై రైతులకు క్షేత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్ర స్తుత తరుణంలో కూలీల కొరత ఏర్పడడం వల్ల యాంత్రీకరణ పద్దతిని అమ లు చేయడం జరుగుతుందన్నారు. అం దులో భాంగానే ఈ వరినాటే యంత్రాలను రైతులకు అందుబాటులోకి తేవ డం జరిగిందన్నారు. ఈ వరినాటే యంత్రాలకు సంబంధించి జగిత్యాల, వరంగల్ వంటి కేంద్రాల్లో పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. సాధారణంగా వరినాట్లు నాటుకుంటే ఎకరాకు 30కేజీలు అవసరం ఉంటుందని, ఈ యాంత్రీకరణ పద్దతి ద్వారా పాల్తిన్ కవర్లపై నాటుకుంటే 50శాతం వరకు విత్తనాలు తక్కువ పడతాయన్నారు. ఈ పద్దతి ద్వారా సుడిదోమ, వివిధ రకాల చీడపీడలను నివారించవచ్చన్నారు. దాదాపు ఏడు రకాల మిషన్లను ప్రదర్శన చేయడం జరిగిందన్నారు. రెండున్నర లక్షల నుంచి 12లక్షల వర కు ఈ వరినాటే మిషన్లు అందుబాటు లో ఉన్నాయన్నారు. రోజుకు సుమారు ఐదు నుంచి 8 ఎకరాల వరకు మిషన్ల ద్వారా నారు నాటవచ్చన్నారు.

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం పాలెం ద్వారా సుమారు 120 ఎకరాల్లో ఈ సీజన్‌లో నాటడం జరిగిందన్నారు. 15రోజుల పాటు ఫాల్తిన్ కవర్లపై వరినారును పెంచి నారును యంత్రాల సా యంతో పొలంలో నాటడం జరుగుతుందన్నారు. వరుసకు వరుస మధ్య 30 సెంటీ మీటర్లు ఉంటుందన్నారు. ప్రస్తుత సంవత్సరం 9లక్షల హెక్టార్లలో వరిసాటు చేయడం జరుగుతుందన్నా రు. ఎకరాకు రూ.2వేల చొప్పున డ బ్బులు తీసుకొని యంత్రాల ద్వారా వరిని నాటడం జరుగుతుందన్నారు. నాటేకంటే 48గంటల ముందు పొలా న్ని తయారు చేసుకొని నాటుకోవాలన్నారు. సబ్సిడీపై ఈ మిషన్లను త్వరలోనే అందుబాటులోకి రానున్నాయ ని, ఆసక్తి గల రైతులు మిషన్లు కొనుగోలు చేసుకోవచ్చన్నారు. అంతకముం దు ప్రదర్శన ద్వారా రైతులకు వరినారు నాటే విధానాన్ని చూయించారు. ఈ సందర్భంగా పరిశోధన కేంద్రం ఆవర ణలో పెద్ద, చిన్న ట్రాక్టర్లు వివిధ కంపె నీలకు సంబంధించిన చిన్న, పెద్దపాటి వరినాటే యంత్రాలను ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. ఈ యంత్రాల ప్రద ర్శన పలువురు రైతులను ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఏడీఆర్ వెంకటరమణ, కేవీకే కో ఆర్డినేటర్ జగన్మోహన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, నీలిమ, అసోసియేషన్ డీన్ జోసేఫ్, సుజాత ఉన్నారు.

87
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...