ఇంటింటా కంటివెలుగు


Fri,September 7, 2018 01:53 AM

నాగర్‌కర్నూల్ టౌన్: జిల్లాలో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమానికి అపూర్వ స్పందన లభిస్తోంది. గ్రామాల్లో ప్రజలు పరీక్షలు చేయించుకోవడాని క్యూలు కడుతున్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి పరీక్షలు చేయలేదని కేసీఆర్‌కు రుణపడి ఉంటామని కొనియాడారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 51,821 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 9,216 మందికి అద్దాలు పంపిణీ చేసినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. కాగా 9,520 మందికి ఆపరేషన్ల కోసం రెఫర్ చేసినట్లు తెలిపారు. గురువారం ఒక్కరోజే జిల్లా వ్యాప్తంగా 25 కంటి శిబిరాల ద్వారా 5563 మందికి పరీక్షలు జరిపి 539 మందికి అద్దాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇంకా కంటి ఈపరేషన్లకోసం 473 మందిని రెఫర్ చేయగా, వివిధ కంటి సమస్యలతో బాధపడుతున్న 314 మందికి పరీక్షలకోసం పంపినట్లు జిల్లా అధికారులు తెలిపారు.

96
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...