పాలమూరు పనులను పరిశీలించిన జేసీ


Fri,September 7, 2018 01:53 AM

కొల్లాపూర్, నమస్తే తెలంగాణ: తెలంగాణలోని 12.40లక్షల ఎకరాల బీడు భూములకు సాగునీరందించేందుకు మండల పరిధిలోని ఎల్లూరు శివారులో జరుగుతున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులోని మొదటి ప్యాకేజీలో సొరంగం పనులను గురువారం మధ్యాహ్నం నాగర్‌కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి పరిశీలించారు. సొరంగం పనులు జరుగుతున్న ఎర్రొళ్లబండ ప్రదేశంలో ప్రాజెక్టుకు కావల్సిన షెడ్లు, గోడౌన్లు, భవిష్యత్‌లో ఇతర అవసరాల కోసం సుమారు 44 ఎకరాలు అవసరం ఉండగా జేసీ స్థానిక మండల రెవిన్యూ అధికారిణి సరస్వతి, ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర ఇంజినీరింగ్ అధికారులతో కలిసి అట్టి భూములను పరిశీలించారు. ఆయా భూములకు సంబంధించిన రైతులు కంటె రామస్వామి, ఇతర రైతుల పక్షాన ఎల్లూరు గ్రామానికి చెందిన ఈజీఎంఎం డైరెక్టర్ జటప్రోల్ శేఖర్‌రెడ్డిలు అధికారులతో చర్చించారు. అనంతరం జేసీ ఇతర అధికారులు కలిసి అక్కడికి సమీపంలో రేగుమాన్‌గడ్డ వద్ద నిర్మించిన మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నీటి డెలివరీ అవుతున్న తీరును పరిశీలించారు. ఈయన వెంట పీఆర్‌ఎల్‌ఐ ప్రాజెక్టు ఈఈ విజయకుమార్, డీఈ ప్రవీణ్‌కుమార్, జేఈ శ్రీను ఉన్నారు.

100
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...