కేసీఆర్ చిత్ర పటానికి.. క్షీరాభిషేకం


Fri,September 7, 2018 01:52 AM

నాగర్‌కర్నూల్ టౌన్: కాంట్రాక్టు లెక్చరర్లకు చెందిన 12నెలల వేతనం జీవోను విడుదల చేయడం పట్ల లెక్చరర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు నాగర్‌కర్నూల్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో లెక్చరర్లు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వేతనం చెల్లించేందుకు 222 జీవో విడుదల చేయడం సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈకార్యక్రమంలో టీజీసీసీఎల్‌ఏ, 711 నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు, అధికార ప్రతినిధి షహజాదిబేగం, లెక్చరర్లు కవిత, శ్రీనివాసులు, శిరీష, రామారావు తదితరులు పాల్గొన్నారు.

97
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...