సమరానికి.. సై!


Fri,September 7, 2018 01:52 AM

మహబూబ్‌నగర్,నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్న అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు స్వాగతించారు. అనంతరం గవర్నర్ నరసింహన్‌ను కలసిన బేటీలో మంత్రి వర్గ నిర్ణయాన్ని తెలియపరచడం.. వెంటనే ఆమోదించడం జరిగిపోయింది. తెలంగాణ భవన్‌కు చేరుకున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రద్దు నిర్ణయం వెల్లడించడంతో ఒక్కసారిగా అన్ని ప్రాంతాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అతితక్కువ కాలంలో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే అభివృద్ధిలో నెంబర్ వన్‌గా నిలిపిన సందర్భంలో నేడు తీసుకున్న అసెంబ్లీ రద్దు నిర్ణయం టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నేతలందరికీ నైతికబలంగా నిలుస్తుంది.

నిరంతరం ప్రజల్లోనే..
సమైక్యరాష్ట్ర పాలనకు.. సొంత పాలనకు చాలా వ్యత్యాసం ఉంది. ఢిల్లీ ఆదేశాలతో నడిచిన ప్రభుత్వాల్లో పని చేసిన మంత్రులు, ఎమ్మెల్యేల పరిస్థితి గతంలో అధ్వాహ్నంగా ఉండింది. ఎన్నికలు ముగిసిన అనంతరం గెలుపొందిన వారు ప్రజలకు కనిపించకుండాపోయే పరిస్థితులు సమైక్యపాలనలో ఉండేవి. ప్రతి ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలప్పుడే ప్రత్యక్షమయ్యే మంత్రులు, ఎమ్మెల్యేలు సమైక్యపాలనలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. సొంత రాష్ట్రంలో పరిస్థితులు సమైక్యపాలనకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తున్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు చేరువకావడానికి... చేపట్టిన అభివృద్ధి పనులే నిదర్శనంగా నిలుస్తున్నాయి.

అభివృద్ధికి బాటలు..
65 ఏళ్లకు పైగా సమైక్యపాలనలో నలిగిన తెలంగాణ ప్రాంతం నాలుగున్నరేళ్లలోనే వేగంగా అభివృద్ధి జరిగింది. సమైక్యపాలనలో అత్యంత దగాకు గురైనా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా భారీ మూల్యం చెల్లించుకుంది. వలసలకు.. కరువుకు నిలయమై నిత్యం ఆత్మహత్యలకు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తుంపు తెచ్చిన ఘనత గతపాలకులది. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పాలమూరు నేడు ఎటు చూసినా పచ్చబడింది. వలసల జిల్లాగా ఉన్న ఉమ్మడి పాలమూరు ఇతర రాష్ర్టాల ప్రజలకు ఉపాధి చూపించే స్థాయికి చేరుకున్నది. నేడు టీఆర్‌ఎస్ ప్రభుత్వం రద్దు అంశం పల్లెలు.. పట్టణాలకు పాకిన సందర్భంలో ఒక్కసారిగా నాలుగేళ్లనాటి పింఛన్ పథకం నుంచి ఇటీవల అమలు చేస్తున్న కంటి వెలుగు పథకాల అమలు తీరును ప్రజలు నెమరు వేసుకుంటున్నారు.

సమరానికి సిద్ధం..
నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా శ్రేయస్సు కోసం నాలుగున్నరేళ్లుగా పనిచేసినం. తాజా మాజీ మంత్రు లు జూపల్లి కృష్ణా రావు, లకా్ష్మ రెడ్డి, నిరంజన్ రెడ్డిలు మేం ఎన్నికల సమరానికి ఎప్పుడైనా సిద్ధమేనంటున్నారు. ఎప్పుడు పిలిచినా ప్రజల ముందు వాలిపోయే ఎమ్మెల్యేలు సైతం సిద్ధమంటున్నారు. అసెంబ్లీ రద్దు నిర్ణయంతో మారిన రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వెల్లడించిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.

98
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...