జీవనోపాధిని మెరుగు పర్చుకోవాలి

Wed,December 11, 2019 06:23 AM

-కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి
ములుగు, నమస్తే తెలంగాణ : జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ప్లాస్టిక్ నివారణ కార్యక్రమంలో భాగంగా అన్ని వర్గాల ప్ర జలు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ జీవనోపాధులను మెరుగుపర్చుకోవాలని కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి సూచించారు. మంగళవారం జిల్లా కేంద్రం లో వితంతువు, ఒంటరి మహిళలు, మాత, పిత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జూట్ బ్యాగుల త యారీ కేంద్రాన్ని కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్‌లో ఉన్న పోటీతత్వాన్ని ఎదుర్కొని వినియోగదారులకు నాణ్యమైన ఆకర్షణీయంగా ఉండే జూట్ బ్యాగులను చౌక ధరలకు ధరలకు అందేవిధంగా చూడాలన్నారు. ఒంటరి మహిళలు, నిరాశ, నిస్పృహలకు లోనుకాకుండా మనోధైర్యంతో ముందుకు సాగుతూ తమ పిల్లల భవిష్యత్తు కోసం పాటుపడాలని అన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ ప థకాలను వినియోగించుకొని ముందడుగు వేయాలని అ న్నారు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఒంటరి మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్న సంద బాబు అభినందనీయుడని అ న్నారు. జెడ్పీ సీఈవో పారిజాతం, జిల్లా సంక్షేమ అధికారి మల్లీశ్వరీ, ములుగు ఎస్సై బండారి రా జు, సొసైటీ సమన్వయకర్తలు రాజు, సుదర్శన్, శ్రీనివాస్, జిల్లా అధ్యక్షురాలు అమీనాసుల్తానా, ప్రధాన కార్యదర్శి మల్లిక, సభ్యులు వసంత, కృష్ణవేణి, స్పందన, సరిత, మ హర్షీ కళాశాల కరస్పాండెంట్ తుమ్మ పిచ్చిరెడ్డి పాల్గొన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles