దరఖాస్తుల ఆహ్వానం

Fri,December 6, 2019 03:03 AM

ములుగురూరల్‌, డిసెంబర్‌ 3: ములుగు జిల్లా కేంద్రం పరిధిలోని బండారుపల్లి మోడల్‌ పాఠశాలలో జీపీటీ కామర్స్‌ పోస్టు కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ గుండు రవిప్రసాద్‌ గురువారం ఒక ప్రకటనలో సూచించారు. తాత్కాళిక పోస్టు కేవలం ఈ విద్యాసంవత్సరం ఏప్రిల్‌ వరకు ఉంటుందని తెలిపారు. 9వ, 10వ తరగతులకు సాంఘీకశాస్త్రం, ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కామర్స్‌ బోధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఒక తరగతికి రూ.140 చొప్పున నెలకు 100 తరగతులకు మించకుండా కేటాయంచనున్నట్లు వివరించారు. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు పాఠశాల పనివేళలో ఈ నెల 7వ తేదీ సాయంత్రం 4గంటల వరకు దరఖాస్తు, అర్హతకు సంబంధించిన జిరాక్స్‌ పత్రాలను సమర్పించాలని సూచించారు. తరగతి గది బోధన పరిశీలన అర్హత ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని ఆయన వివరించారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles