మండపాకలో గన్నీబ్యాగుల కలకలం

Wed,December 4, 2019 02:30 AM

-తమవే అన్న జీసీసీ మేనేజర్ సమ్మయ్య
వాజేడు, డిసెంబర్03: మండలంలోని మండపాక వ్యవసాయమ్కాట్ కమిటీ చెక్‌పోస్టుకు కూతవేటు దూరంలో ప్రభుత్వ కోనుగోలు కేంద్రాలకు సంబంధించిన ధాన్యం సంచులు(గన్నీ బ్యాగులు)దర్శన మిచ్చాయి. అయితే ఇక్కడ సొసైటీ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఒక్క, ధాన్యం కోనుగోలు కేంద్రం మాత్రమే మండపాకలో ఏర్పాటు చేశారు. అయితే ఈ బ్యాగులను చూసిన సొసైటీ సీఈవో సోమ సత్యనారయణ ఎవరివి అని ఆరా తీయగా అక్కడ ఎవరు లేకపోవడంతో వాటిని ఫొటోలు తీసి కలెక్టర్, డీఎస్‌వోకు పంపారు.

దీనిపై కలెక్టర్ సంచులు ఎవరివి అని డీఎస్‌వో ద్వారా ఆరాతీయగా అవి జీసీసీ వాజేడు కొనుగోలు కేంద్రానివి అని తెలిసింది. అయితే వాజేడులో ఉండాల్సిన గన్నీబ్యాగులు మండపాకలో దర్శనమియడం కలకలం రేపింది. ఈ విషయంపై నమస్తేతెలంగాణ వెంకటాపురం జీసీసీ మేనేజర్ కోడిపె సమ్మయ్యను ఫోన్లో వివరణ కోరాగా గతంలో మైసమ్మ ఆలయం సమీపంలో జీసీసీ కోనుగోలు కేంద్రం ఏర్పాటు చేశామని తెలిపారు. అక్కడ రెండు కొనుగోలు కేంద్రాలు ఉండడంతో జీసీసీ కొనుగోలు కేంద్రాన్ని మండపాకకు మార్చామని, గన్నీ సంచులు జీసీసీకి చెందినవేనని ఆయన చెప్పారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles