ముమ్మరంగా వాహన తనిఖీలు

Wed,December 4, 2019 02:29 AM

చిట్యాల, డిసెంబర్03: మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా పోలీసులు అప్రమత్తం అయ్యా రు. ఈ మేరకు మండల కేంద్ర శివారు ప్రధాన రహదారి కూడలివద్ద ఎస్సై(2) సూర్యనారయణ ఆధ్వర్యంలో వాహనాలు నిలిపి క్షుణ్ణంగా సోదా చేశారు. అనుమానితులను విచారించి వదిలేశారు. తనిఖీల్లో సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు ఉన్నారు.

అంతర్ రాష్ట్ర వంతెనపై హైఅలర్ట్ ..
కాళేశ్వరం: మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో తెలంగాణ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర సరిహద్దు కాళేశ్వరం గోదావరి నదిపై గల అంతర్ రాష్ట్ర వంతెన వద్ద హైఅలర్టు విధించింది. అలాగే, గోదావరినది పరీవాహక ప్రాంతంపై డేగకన్ను వేసింది. మావోయిస్టు ప్రభావిత మహదేవ్‌పూర్, మహాముత్తారం, కాటారం మండలాల్లోని సమస్యాత్మక ప్రాంతాలతోపాటు గోదావరి నదిపై నిరంతరం పోలీసు బలగాలతో నిఘాను తీవ్రతరం చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం కాళేశ్వరం వద్ద అంతర్ రాష్ట్ర వంతెనపై కాళేశ్వరం ఎస్సై శ్రీనివాస్ అధ్వర్యంలో పోలీసులు నాకాబందీ నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి వంతెనమీదుగా తెలంగాణలోకి ప్రవేశించే వాహనాలను పూర్తిస్థాయిలో తనిఖీచేసి అనుమానితులను ప్రశ్నించి వదిలిపెట్టారు. కాగా, పీఎల్‌జీఏ వారోత్సవాల తొలి రోజునే సరిహద్దు అవతలి వైపుగల మహారాష్ట్ర అడవుల్లో మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ నెపంతో ఇద్దరిని హతమార్చారు.

గోదావరి తీరంలోని ఏటపల్లి తాలూకా పలసగొంది గ్రామంలో సోమవారం తెల్లవారు జామునే ఎన్‌సీపీ కార్యకర్త మాసు పుంగాటి, గ్రామ పోలీస్ పటేల్ రుషి మైశ్రాను ఊరి పొలిమేరల్లోకి తీసుకెళ్లిన మావోయిస్టులు అక్కడ అతి దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా అటవీ శాఖకు చెందిన ఇద్దరు సిబ్బందిని చెట్లకు కట్టేసి చితకబాదారు. మావోయిస్టులు ఏ క్షణంలోనైనా గోదావరినది దాటి ఇటుగావచ్చే అవకాశం ఉండడంతో అంతర్ రాష్ట్ర వంతెన వద్ద పోలీస్ బలగాలు నిరంతరం పహారా కాస్తున్నాయి. వంతెనపై వచ్చిపోయే అన్ని వాహనాలను క్షుణ్ణంగా సోదాచేస్తున్నారు. అలాగే, మాజీ నక్సలైట్ల కదలికలపై కూడా ఆరా తీస్తున్నారు. మావోలకు అత్యంత ప్రభావితంగా ఉన్న గ్రామాలపై డేగకన్ను వేసి ఉంచారు. ఈ నెల వ తేదీ వరకు జరగనున్న వారోత్సవాల నేపథ్యంలో తనిఖీలను మరింత ముమ్మరం చేశారు.


అంబట్‌పల్లి ప్రధాన రహదారిపై
పలిమెల: మహదేవ్‌పూర్ మండలంలోని అంబట్‌పల్లి ప్రధాన రహదారిపై మంగళవారం సాయం త్రం పలిమెల ఎస్సై శ్యాంరాజ్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో మేడిగడ్డ ప్రాజెక్టు ఆవరణలో వా హనాలను క్షుణ్ణంగా సోదాచేశారు. వాహన పత్రాలు లేనివారికి జరిమానా విధించారు. అనుమానిత వ్య క్తులను విచారించి వదిలేశారు. కార్యక్షికమంలో సివి ల్, సీఆర్పీఎఫ్ పోలీసు సిబ్బంది ఉన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles