ప్రతి ఒక్కరూ యూనిఫాంలేని పోలీసులే

Tue,December 3, 2019 02:29 AM

-ములుగు ఓఎస్డీ సురేశ్
-మాజీ మావోయిస్టులకు కౌన్సెలింగ్
ఏటూరునాగారం: ప్రతి ఒక్కరూ యూనిఫాం లేని పోలీసులేనని ములుగు ఓఎస్డీ సురేశ్ పేర్కొన్నారు. మాజీ మావోయిస్టులు, మాజీ మిలిటెంట్లకు పోలీసుశాఖ ఆధ్వర్యంలో సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్ ఆవరణలో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో ఓఎస్డీ మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు పాల్పడకుండా, సమాజంలో మంచిపేరు తెచ్చుకోవాలని వారికి సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఏజెన్సీ ప్రాంతంలో కొత్త వ్యక్తులు, అనుమానాస్పందంగా తారసపడితే తప్పనిసరిగా పోలీసులకు సమాచారం అందించాలన్నారు. అసాంఘిక, సంఘ విద్రోహ శక్తులు, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిని ప్రోత్సహించొద్దని ప్రజలను కోరారు. తెలంగాణ డీజీపీ, ఎస్పీల ఆదేశాల మేరకు అన్నివర్గాల సంక్షేమమే ధేయ్యంగా పోలీసుశాఖ పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే గ్రామీణ యవతకు వివిధ క్రీడల్లో, వ్యాయామంలో అవసరమైన శిక్షణ ఇస్తూ, క్రీడా సామగ్రి అందించి ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. మండల స్థాయిలో నైపుణ్యం ప్రదర్శించిన వారిని జిల్లా స్థాయికి తీసుకెళ్లేలా యువతను ప్రోత్సహిస్తున్నామన్నారు.

గొత్తికోయల గూడేల్లో తరుచూ మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని, వికలాంగులకు అవసరమైన పరికరాలు పంపింణీ చేస్తున్నట్లు వివరించారు. నిత్యం వాహనాలు తనిఖీ చేస్తూ, కార్డన్‌అండ్ సెర్చ్ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ముల్లకట్ట వంతెన పరిసరాల్లో పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు. తాగి వాహనాలు నడపకుండా ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తున్నామని చెప్పారు. నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల వివరాలు తెలుసుకుని, రౌడీషీటర్ల బైండోవర్లు, కౌన్సెలింగ్‌లు చేపడుతున్నామన్నారు. ఈ సమావేశంలో సీఐ నాగబాబు, ఎస్సైలు ఎన్ శ్రీకాంత్‌డ్డి, వెంక సురేశ్ పాల్గొన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles