కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలి

Mon,December 2, 2019 02:45 AM

కాళేశ్వరం, డిసెంబర్‌ 1 : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలని జెడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి అన్నారు. ఆదివారం మహదేవపూర్‌ మండలం రాపెళ్లి కోటలో డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రైతును రాజుగా చూసే రోజులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వల్లే వచ్చాయని తెలిపారు. ఆకలి లేని రాజ్యం కావాలని, ప్రజల ఆకలి తీర్చి పట్టెడు అన్నం పెట్టేది రైతేనన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస మద్దతు ధరను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. అనంతరం రాపెళ్లి కోటలో ఉన్న చర్చిలో ప్రార్థనలు చేశారు. గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులు జెడ్పీ చైర్‌పర్సన్‌ శ్రీహర్షిణి దంపతులకు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు జక్కు రాకేశ్‌, ఎంపీపీ రాణీబాయి, కాటారం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భవానీ, మహదేవపూర్‌ సర్పంచ్‌ శ్రీపతి బాపు, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్‌ మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles