నేడు ప్లాస్టిక్ ఫ్రీపై సమీక్ష, సమావేశం

Mon,November 11, 2019 01:29 AM

-హాజరుకానున్న మంత్రి దయాకర్‌రావు, జెడ్పీచైర్మన్, ఎమ్మెల్సీ పోచంపల్లి
ములుగు జిల్లా ప్రతినిధి/నమస్తేతెలంగాణ: ములుగు జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చాలని జిల్లా కలెక్టర్ తలపెట్టిన ప్లాస్టిక్ ఫ్రీ జిల్లాలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలలోను ప్లాస్టిక్ రహిత ప్రదేశాలుగా గుర్తించాలని కోరుతూ సమీక్ష, సమావేశాన్ని సోమవారం ఉదయం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నారు. ఈ సమీక్ష, సమావేశానికి రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ములుగు జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీశ్వర్, ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ చింతకుంట నారాయణెడ్డి హాజరుకానున్నారు.

అదేవిధంగా జిల్లాలోని ప్లాస్టిక్ ఫ్రీ టెంపుల్స్-టూరిస్టు ప్రదేశాలు అనే అంశంపై సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లా పర్యాటకశాఖ అధికారి, దేవాదాయశాఖ కమిషనర్, రామప్ప అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న పంచాయతీ రాజ్ ఈఈ, రామప్ప సరస్సు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న నీటి పారుదలశాఖ ఈఈలతో పాటు జిల్లా అధికారులు పాల్గొననున్నారు. జిల్లా కలెక్టర్ ఇంతకు ముందే జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా గుర్తించాలని జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను చేపట్టారు. ఈ నెల 15వ తేదీన ప్లాస్టిక్ నిషేధంపై భారీ ఎత్తున ప్రదర్శనలు, పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీల్లో పాల్గొనే వారు ఈ నెల 14వ తేదీలోపు తమ ఎంట్రీలను పంపించాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో వెల్లడించిన విషయం తెలిసిందే.

14
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles