అభయారణ్యంలో విద్యార్థుల ట్రెక్కింగ్

Mon,November 11, 2019 01:29 AM

తాడ్వాయి: ఏటూరునాగారం అభయారణ్యంలో గల తాడ్వాయి అడవుల్లో ఆదివారం హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కోర్సులకు చెందిన 50మంది విద్యార్థులు ట్రెక్కింగ్‌లో పాల్గొన్నారు. ముందుగా తాడ్వాయిలోని వనకుటీరాలలో గల అధ్యయన కేంద్రాన్ని సందర్శించారు. అడవుల్లో నివసించే ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలతోపాటు వారి ఆహార నియమాలు, జంతువులు, ప్లాస్టిక్ వినియోగం, వనాల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, అడవుల ప్రాముఖ్యతను టూరిజం జిల్లా కోఆర్డినేటర్ సుమన్ వారికి వివరించారు. అనంతరం దామెరవాయి సమీప అటవీ ప్రాంతంలో ఉన్న 3వేల ఏళ్లనాటి రాకాసి గృహాలను సందర్శించారు. వాటి ప్రత్యేకతలను విద్యార్థులకు వివరించారు.

అక్కడి నుంచి తాడ్వాయి అడవుల్లో జంతువుల కోసం ఏర్పాటు చేసిన గ్రాస్ ప్లాంట్లను, కొండపర్తి సమీపంలోని బ్లాక్‌బెర్రీ ఐలాండ్‌లను ట్రెక్కింగ్ చేస్తూ చూపించారు. వనాల సంరక్షణ గురించి తెలియజేయడమే ఈ ట్రెక్కింగ్ ముఖ్య ఉద్దేశమని సుమన్ తెలిపారు. కార్యక్రమంలో వాగ్ధేవి డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి రజిన్‌కుమార్, తాడ్వాయి వైల్డ్ లైఫ్ ఎఫ్‌ఆర్వో షౌకత్‌హుస్సేన్, హట్స్ మేనేజర్ సాయికృష్ణ, గైడ్‌లు ప్రసన్న, సారయ్య, మహేశ్, కార్తీక్ ఉన్నారు.

17
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles