ఆలయంలో పూజలు చేసిన ఐటీడీఏ పీవో

Mon,November 11, 2019 01:29 AM

కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని ఆదివారం ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో గణపతి వద్ద పూజలు నిర్వహించి, స్వామి వారిని దర్శించుకున్నారు. అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. అక్కడి నుంచి పార్వతి అమ్మవారి ఆలయానికి చేరుకుని పూజలు చేశాక, అర్చకులు కల్యాణ మండపంలో ఆశీర్వచనం చేశారు. స్వామి వారి కండువాతో సన్మానించారు. అక్కడి నుంచి స్థానిక గిరిజన ఆశ్రమ పాఠశాలకు చేరుకున్నారు. అక్కడ విద్యార్థుల సమస్యల అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట ఎంపీటీసీ మమత, సర్పంచ్ వెన్నపురెడ్డి వసంత, హెచ్‌ఎం జయమాల ఉన్నారు.

14
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles