క్రీడారంగంలో జిల్లాను అగ్రగామిగా నిలపాలి

Sun,November 10, 2019 02:03 AM

-క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం
-జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్
-ములుగులో 65వ ఎస్‌జీఎఫ్‌టీ సెలెక్షన్
-1296 మంది క్రీడాకారులు హాజరు

ములుగు, నమస్తే తెలంగాణ: ములుగు జిల్లాను క్రీడారంగంలో అగ్రగామిగా నిలపాలని ములుగు జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ సూచించారు. క్రీడల్లో రాణించే విద్యార్థులకు ప్రభు త్వం తరుపున సహకారం అందిస్తానని చెప్పారు. 65వ జిల్లా స్థాయి పాఠశాలల ఎంపిక క్రీడాపోటీలను జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించారు. వరంగల్ ఆర్జేడీ, ఇన్‌చార్జి డీఈవో పెగడ రాజీవ్ ఆధ్వర్యంలో కొనసాగిన ఎంపిక పోటీలకు 9 మండలాల నుంచి 1296 మంది క్రీడాకారులు హాజరయ్యారు. కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్‌లో మెరుగైన ఆట తీరును కనబర్చే 144 మంది విద్యార్థులను శనివారం, ఆదివారాల్లో ఎంపిక చేయనున్నారు. ఎంపికైన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఓఎస్డీ సురేశ్‌కుమార్, ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవిసుధీర్‌యాదవ్‌తో కలిసి జెడ్పీ చైర్మన్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎస్‌జీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎస్‌జీఎఫ్ జిల్లా క్రీడా కార్యదర్శి సంగ చేరాలు క్రీడా నివేదికను, జిల్లాలో క్రీడారంగం అభివృద్ధి చెందడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. మండలాల వారీగా క్రీడాకారులు గౌరవ వందనాన్ని సమర్పించారు. జెడ్పీచైర్మన్, ఓఎస్డీలు క్రీడాకారులను పరిచయం చేసుకొని, క్రీడలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ జగదీశ్వర్ మాట్లాడుతూ సాంకేతిక యుగంలో విద్యార్థులు క్రీడలకు దూరమయ్యారని, ఉపాధ్యాయులు, పీఈటీ, పీడీలు కృషి చేసి, ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకొని రాణించాలని, క్రీడారంగంలో జిల్లాను అగ్రగామిగా నిలిపేలా కృషి చేయాలని కోరారు. క్రీడాకారుల అభిరుచికి అనుగు ణంగా శిక్షణ అందించాలని ఓఎస్డీ సురేశ్ కుమార్ పీఈటీలకు సూచించారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండాల న్నారు. ఎంపీపీ గండ్రకోట శ్రీదేవిసుధీర్‌యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం తరుపున క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇన్‌చార్జీ డీఈవో రాజీవ్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు అవసరమన్నారు.

జెడ్పీ చైర్మన్, ఓఎస్డీ, ఎంపీపీ, విశ్రాంత పీఈ టీ దొంతిరెడ్డి బలరాంరెడ్డిని జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఎంపీటీసీలు గొర్రె స మ్మయ్య, మాచర్ల ప్రభాకర్, పోరిక విజయ్‌రాంనాయక్, దేవరనేని స్వామిరావు, ఎంఈవో శ్రీనివాసులు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మల్లయ్య, ప్రధాన కార్యదర్శి వేణు, పీఈటీలు, జగదీశ్, రాములు, ఆదినారాయణ, లక్ష్మీనారాయ ణ, భవాని, దీప్తి, లవనిక, కవిత, జ్యోతి, శ్రీదేవి, కృష్ణ, శరత్, వెంకట్‌రెడ్డి, భాస్కర్, టీ రమేశ్, డీసీఈబీ సెక్రటరీ చాగర్ల ఐల య్య, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు బాదం ప్రవీణ్‌కుమార్, పట్టణాధ్యక్షుడు మేర్గు సంతోశ్, గోవింద్‌నాయక్, మోహన్‌రావు, రమేశ్‌రెడ్డి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles