ముగిసిన జోనల్ స్థాయి క్రీడలు

Sun,November 10, 2019 02:02 AM

ఏటూరునాగారం, నవంబర్ 09 : ఏటూరునాగారంలో ఐటీడీఏ గిరిజన సంక్షేమశాఖ పరిధిలో నిర్వహిస్తున్న గిరిజన జోనల్ స్థాయి క్రీడలు శనివారంతో ముగిశాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఏడు డివిజన్ల నుంచి 1050 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. శుక్రవారం ప్రారంభమైన క్రీడలను శనివారం క్రీడాకారుల ఎంపికతో ముగిసినట్లుగా స్పోర్ట్స్ ఆఫీసర్ వజ్జ నారాయణ తెలిపారు. పలు క్రీడలను శనివారం నిర్వహించారు. ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు, డీటీడీవో ఎర్రయ్య నేతృత్వంలో నిర్వహించిన ఈ క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో పాల్గొనేందుకు 244 మంది క్రీడాకారులను ఎంపిక చేశామని నారాయణ తెలిపా రు. 14,17 సంవత్సరాలలోపు బాల, బాలికలకు క్రీడలు నిర్వహించారు. ఈనెల 27 నుంచి అదిలాబాద్ జిల్లా ఉట్నూరులో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడలకు 244 మంది క్రీడాకారులు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి పాల్గొంటారని, 26వ తేదీ రాత్రి ఏటూరునాగారం నుంచి క్రీడాకారులు బయలు దేరుతారన్నారు.

రాష్ట్ర స్థాయి పోటీలకు వాలీబాల్ నుంచి 31, కబడ్డీలో 36, టెన్నికాయిట్‌లో నలుగురు, ఖో-ఖోలో 44, ఆర్చరీలో 32, అథ్లెటిక్స్ లో 80, చెస్‌లో 8, క్యారమ్స్‌లో 8 మంది క్రీడాకారులను ఎంపిక చేశారు. రెండు రోజుల పాటు జరిగిన ఎంపిక క్రీడల్లో క్రీడాకారులకు అవసరమై న భోజన, వసతి కల్పించారు. క్రీడాకారుల ఎంపికలో ఏసీఎంవో సారయ్య, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు కిష్టు, దేవీలాల్, యాలం ఆదినారాయణ, కృష్ణ, శరత్, సమ్మయ్య, రమేశ్, సతీశ్, గ్రౌండ్ ఇన్‌చార్జి దేవర భాస్కర్, శ్యామలతతోపాటు 50 మంది పీఈటీలు పాల్గొన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles