మెరుగైన వైద్య సేవలు అందించాలి

Sun,November 10, 2019 02:00 AM

చిట్యాల, నవంబర్ 09 : మండల కేంద్రంలోని సివిల్ దవాఖానాను రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనరేట్ రాష్ట్ర స్వైన్ ఫ్లూ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ రమేష్ కుమార్, హుజురాబాద్ ప్రాంతీయ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ రవిప్రవీణరెడ్డిలు సందర్శించారు. స్వైన్ ఫ్లూ స్పెషల్ ఆఫీసర్లు సివిల్ దవాఖానను తనిఖీ చేశారు. అనంతరం సివిల్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ తిరుపతి, డాక్టర్ శ్రీకాంత్‌తో సమీక్షా సమావేశం నిర్వహించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సివిల్ దవాఖానలో స్వైన్ ఫ్లూకు ప్రత్యేక ఓపీ విభాగం ఏర్పరిచినట్లు తెలిపారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. అంతేకాకుంగా స్వైన్ ఫ్లూపై ప్రజలకు అవగాహన కల్పించాలని, నిర్ములనకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. దవాఖానలో ల్యాబరేటరీ, ఫార్మసీ, ఆధునిక వైద్య యంత్రాలు అందుబాటులో ఉన్నాయని, వైద్యులు నిత్యం సమయపాలన ప్రకారం రోగులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈకార్యక్రమంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది మల్లికార్జున్, రాణి తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles