మహిళలు ఆర్థికంగా ఎదగాలి

Sun,November 10, 2019 02:00 AM

చిట్యాల, నవంబర్ 09 : మహిళల చిన్నతరహా పరిశ్రమలు ఏర్పరుచుకుని ఆర్థికంగా ఎదగాలని నాబార్డ్ ఏజీఎం కృష్ణమూర్తి అన్నారు. శనివారం మండలంలోని చల్లగరిగె గ్రామంలో సర్పంచ్ కర్రె మంజుల అధ్యక్షతన లక్ష్యం స్వచ్ఛంద సంస్థ సీఈవో తొళ్లూరి లత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జర్ధోషి, మగ్గం వర్క్ ట్రైనింగ్ తీసుకున్న 30 మంది మహిళలకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. మహిళలు కుటీర పరిశ్రమల సంపాదనతో తమ కుటుంబాలకు ఆర్థికంగా బాసటగా నిలిచి అభివృద్ధి చెందాలన్నారు. ఈకార్యక్రమంలో ఏపీజీవీబి ఫీల్డ్ ఆఫీసర్ నవీన్, సీఏటీ శ్వేత, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles