లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్‌లో 15 గేట్ల ఎత్తివేత

Sat,November 9, 2019 05:48 AM

మహదేవపూర్, నవంబర్ 8: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లిలోని లక్ష్మీ (మేడిగడ్డ)బరాజ్‌లో శుక్రవారం 15 గేట్లను ఎత్తి నీటిని తరలిస్తున్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. కొన్ని రోజులుగా మహారాష్ట్రలో కురిసిన వర్షాలతో ప్రాణహిత నది ప్రవహిస్తూ గోదావరి నదిలోకి కలుస్తోంది. ఆ వరద లక్ష్మీ బరాజ్ కు చేరుతుండగా అధికారులు గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. బరాజ్‌లో 92.70 మీటర్ల ఎత్తులో 2.098 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 78 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 80 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతున్నట్లు తెలిపారు.

సరస్వతీ బరాజ్ గేట్ల మూసివేత
కాళేశ్వరం: సరస్వతీ (అన్నారం)బరాజ్‌లోని అన్ని గేట్ల ను శుక్రవారం మూసేసినట్లు అధికారులు తెలిపారు. బరా జ్‌కు ఇన్‌ఫ్లో 4000 క్యూసెక్కులు వస్తున్నదని, బరాజ్‌లో 10.87 టీఎంసీల సామర్థ్యానికి గానూ 9.00 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఇంజినీర్లు తెలిపారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles