పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

Thu,November 7, 2019 01:59 AM

కలెక్టరేట్, నవంబర్ 6 : జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులు పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి డీ సునీత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2019-20 విద్యా సంవత్సరంలో పోస్ట్‌మెట్రిక్ ఉపకార వేతనాలకు జిల్లాలో అర్హతలను బట్టి ఫ్రెష్, రెన్యువల్ దరఖాస్తు ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా డిసెంబర్ 31వ తేదీలోగా చేసుకోవాలని సూచించారు. సంబంధిత కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల దరఖాస్తులను ఫ్రెష్, రెన్యువల్ వివరాలను వెబ్‌సైట్‌లో త్వరగా నమోదు చేయించే బాధ్యత సంబంధిత కళాశాలల ప్రిన్సిపాల్స్‌దేనని పేర్కొన్నారు. 2014-15 నుంచి 2018-19 వరకు నమోదు చేసిన ఎస్సీ విద్యార్థుల అన్ని పత్రాలు జతపరిచి హార్డ్ కాపీలను, 2014-15 నుంచి 2016-17 వరకు పెండింగ్‌లో ఉన్న హార్డ్ కాపీలను ఈ నెల 15వ తేదీలోపు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. లేదంటే తమ కార్యాలయ లాగిన్ నుంచి తొలగించనున్నట్లు తెలిపారు.

35
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles