వైభవంగా జెడ్పీ చైర్‌పర్సన్ కల్యాణం

Thu,November 7, 2019 01:58 AM

కాటారం, నవంబర్ 6: జయశంకర్ భూపాలపల్లి జెడ్పీ చైర్‌పర్సన్ జక్కు శ్రీహర్షిణి వివాహం జక్కు రాకేశ్‌తో బుధవారం ఘనంగా జరిగింది. కాటారం మండల కేంద్రంలోని బీఎల్‌ఎం గార్డెన్స్‌లో జరిగిన వివాహ వేడుకకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, పెద్దపల్లి, వరంగల్ ఎంపీలు బొర్లకుంట వెంకటేశ్, పసునూరి దయాకర్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు-శైలజ దంపతులు, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, శాసనసభ మాజీ స్పీకర్ మధుసూదనాచారి హాజరయ్యారు. వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ స్వర్ణలత, జెడ్పీ సీఈవో శిరీష, డీపీవో చంద్రమౌళి, డీఆర్‌డీవో సుమతి, ఐసీడీఎస్ ఆర్‌వోలు విజయారెడ్డి, భారతిరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ కల్లెపు శోభా రఘుపతిరావు, కాళేశ్వరం దేవాలయ చైర్మన్ బొమ్మెర వెంకటేశం, డీఎస్పీ బోనాల కిషన్, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి స్వప్న, ఆయా పార్టీల నాయకులు గండ్ర సత్యనారాయణ తదితరులు రాకేశ్, శ్రీహర్షిణి దంపతులను ఆశీర్వదించారు. బొకేలతో శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పీటీసీలు అరుణ, కోమల, శారద, సాగర్, సదయ్య, ఎంపీపీలు సమ్మయ్య, మల్హల్‌రావు, రాణిభాయి, డీసీసీ అధ్యక్షుడు ప్రకాశ్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ చల్ల నారాయణరెడ్డి, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, అధికారులు, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు హాజరై ఆశీర్వదించారు.

22
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles