నిరసనల హోరు..

Tue,November 5, 2019 03:49 AM

-అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌ను సజీవ దహనం చేసిన ఘటనపై రెవెన్యూ సిబ్బంది ఆగ్రహం
-నల్లబ్యాడ్జీలు ధరించి విధుల బహిష్కరణ
-నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
-జిల్లావ్యాప్తంగా ఆందోళన
-డీఆర్వోకు ఉద్యోగుల వినతి
-తహసీల్దార్ హత్యపై పలుచోట్ల నిరసన

ములుగు, నమస్తేతెలంగాణ: రెవెన్యూ ఉద్యోగులకు భద్రత కల్పించాలని కోరుతూ జిల్లా కేంద్రంలోని రెవెన్యూ ఉద్యోగులు సోమవారం డీఆర్వో కూతాటి రమాదేవికి వినతిపత్రం అందించారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి మృతికి సంతాపంగా రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధుల్లో ఉన్న తహసీల్దార్ విజయారెడ్డిపై ఓ వ్యక్తి పెట్రోల్ పోసి నిప్పంటించగా ఆమె మృతి చెందారన్నారు. తహసీల్దార్‌ను కాపాడే ప్రయత్నం చేసిన సిబ్బంది కూడా గాయపడ్డారన్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి నిందితుడిని కఠినంగా శిక్షించి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. వినతిపత్రం అందించిన వారిలో కలెక్టర్ కార్యాలయ ఏవో శ్యాం, తహసీల్దార్ భూక్యా గన్యానాయక్, ఉద్యోగులు, సిబ్బంది ఉన్నారు.

ఏటూరునాగారంలో..
ఏటూరునాగారం : ఏటూరునాగారం తహసీల్ కార్యాల యం వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సత్యనారాయణస్వామి మాట్లాడుతూ తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమం లో డిప్యూటీ తహసీల్దార్ సర్వర్ పాషా, వీఆర్వోలు రాములు, నర్సయ్య, విజయ, నరేశ్, శ్రీనివాస్, పాండయ్య పాల్గొన్నారు.

వెంకటాపూర్‌లో..
వెంకటాపూర్: వెంకటాపూర్ తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ ఆధ్వర్యంలో సోమవారం కార్యాలయ సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాజునాయక్, ఆర్‌ఐ సునీల్ పాల్గొన్నారు.

మంగపేటలో..
మంగపేట : మంగపేట తహసీల్ కార్యాలయం సిబ్బంది సోమవారం విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ హరిచంద్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సమ్మయ్య, ఆర్‌ఐలు కామేశ్వర్‌రావు, శారద, సర్వేయర్ సుష్మ, వీఆర్వోలు రియాజ్, నారాయణ, బాణయ్య, నర్సింహరావు, పాగ శ్రీను, నాగార్జున, రిజ్వానా, వెంకటనర్సమ్మ, తదితలు పాల్గొన్నారు.

వాజేడులో
వాజేడు: వాజేడు తహసీల్ కార్యాలయం ఎదుట డిప్యూటీ తహసీల్దార్ బాబ్జీప్రసాద్ సిబ్బందితో కలసి సోమవారం మౌ నం పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌పై పెట్రోల్‌పోసి నిప్ప ంటించిన దుండగుడిపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్య క్రమం లో ఆర్‌ఐ హరి మురళీకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ ఎండీ జానీ మియా, వీఆర్వో శ్రీను, సిబ్బంది నాగరాజు, సురేశ్, బాల చం ద్రమూర్తి, రాము తదితరులు పాల్గొన్నారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles